Delhi, Aug 22: కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సైతం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. డాక్టర్లు అందరూ తక్షణమే విధుల్లో చేరాలని, వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది.
విధుల్లోకి చేరిన తర్వాత వారిపై అధికారులు చర్యలు తీసుకోకుండా చూసుకుంటామని తెలిపింది సర్వోన్నత న్యాయస్థానం. డాక్టర్లు విధులు నిర్వర్తించకపోతే రోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని...ఈ ఆందోళనతో పేదలు నష్టపోకూడదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది.
కొన్ని సందర్భాల్లో వైద్యులు 36 గంటల పాటు ఏకధాటిగా పనిచేస్తుంటారని...ఆసుపత్రుల్లో వసతులు, పని పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోగలం అని తెలిపింది న్యాయస్థానం. బెంగాల్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్, అక్కడ మహిళలకు భద్రత కరువైందంటూ ఆరోపణ
Here's Tweet:
Supreme Court appeals to doctors to return to their work. SC directs not to take any coercive steps and adverse action against the doctors for protesting.
— ANI (@ANI) August 22, 2024
మరోవైపు దేశవ్యాప్తంగా డాక్టర్లు, మహిళల రక్షణకు జాతీయ స్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ హత్యాచార ఘటనపై దర్యాప్తు పురోగతిపై నివేదికను సీబీఐ ఇవాళ సుప్రీంకోర్టుకు సమర్పించింది.
Here's Tweet:
Supreme Court urges not to politicize the situation and that the law is taking its course. Supreme Court says that they are concerned about the welfare and safety of doctors.
— ANI (@ANI) August 22, 2024