Newdelhi, Feb 15: 2018లో తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం (Electoral Bond Scheme) చెల్లుబాటుపై సుప్రీంకోర్టు (Supreme Court) నేడు తీర్పు (Verdict) వెలువరించనుంది. ఎలక్టోరల్ బాండ్ల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గతేడాది నవంబర్ లో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. రాజకీయ పార్టీల నిధుల సమీకరణకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల పథకం చట్టబద్ధతను సవాలు చేస్తూ ఏడీఆర్, సీపీఎం సహా మరికొందరు పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు.
Supreme Court to pronounce verdict on pleas challenging validity of Centre's Electoral Bonds scheme today#ElectoralBonds #SC pic.twitter.com/kxrCTMDCP0
— Argus News (@ArgusNews_in) February 15, 2024
ఎన్నికల లోపే విచారించాలని అభ్యర్ధన
2024 సార్వత్రిక ఎన్నికలలోపే ఈ పథకంపై సమగ్ర విచారణ జరపాలని అభ్యర్థించారు. దీంతో, గతేడాది అక్టోబర్ 31న ఈ పిటిషన్లపై వాదనలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 2న కోర్టు తన తీర్పు రిజర్వ్ చేసింది. నేడు తీర్పు చెప్పనున్నది. ఈ తీర్పు వచ్చే లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.