CM Revanth Reddy Slams KCR: కేసీఆర్‌ దోపిడీకి కాళేశ్వరం బలైపోయింది, కాలు విరిగిందని తప్పించుకున్నా వదిలిపెట్టేది లేదు, మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy (Photo-Video Grab)

Telangana Congress Visit Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు ప్రాజెక్టును (Telangana Congress Visit Medigadda Barrage) పరిశీలించిన వారిలో ఉన్నారు.

తొలుత బ్యారేజీ పైనుంచి కుంగిన పిల్లర్లను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యారేజీ (Medigadda Barrage) దిగువ భాగంలో కుంగిన పిల్లర్ల వద్ద ఏం జరిగిందో అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఆ తర్వాత 21వ పిల్లర్ వద్ద కుంగిన ప్రాంతం, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని సీఎం బృదం పరిశీలించింది. ఏడో బ్లాక్ లోని పలు పిల్లర్లను వీరు పరిశీలించారు. పగుళ్లు ఏర్పడిన ప్రాంతాలను రేవంత్ ప్రత్యేకంగా పరిశీలించారు.

పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు, నల్గొండ సభలో ధ్వజమెత్తిన కేసీఆర్, తెలంగాణ కోసం ఎందాకైనా వెళతానని స్పష్టం

CM రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రూ. 95 వేల కోట్లను ఖర్చు చేస్తే... 97 వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (CM Revanth Reddy Slams KCR) ధన దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలయిందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలంగాణ సీఎం అన్నారు.

Here's CM Tweet

కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై ఇన్‌ఛార్జి చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. గతేడాది అక్టోబరు 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజినీర్లు వివరించారు. నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చెప్పినప్పటికీ.. సమస్యను చక్కదిద్దే పని చేయకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్‌ బిల్లులే రూ.10,500 కోట్లు వస్తున్నాయని తెలిపారు. ప్రాజెక్టు రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ.25వేల కోట్లు అవసరమవుతాయని వివరించారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్ల దాడి, నల్లచొక్కాలు ధరించి ‘గోబ్యాక్‌ గోబ్యాక్‌’ అంటూ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు నినాదాలు

కుంగిన మేడిగడ్డను ఎవరూ చూడకుండా కేసీఆర్‌ కప్పిపుచ్చారు. ఈసీ అనుమతి పొంది రాహుల్‌ గాంధీ, నేను మేడిగడ్డను పరిశీలించాం. జరిగిన అవకతవకలపై నీటిపారుదల శాఖ మంత్రి విచారణకు ఆదేశించారు. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణలో భారీగా లోపాలు ఉన్నాయని విజిలెన్స్‌ కమిటీ చెప్పింది. రీడిజైన్‌ పేరుతో కాళేశ్వరం చేపట్టి భారీగా అవినీతికి పాల్పడ్డారు. తన బండారం బయటపడుతుందని, అవినీతి బయటపడకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే నల్గొండలో సభ పెట్టారు. చావు నోట్లో తల పెట్టానని కేసీఆర్‌ పదే పదే అంటున్నారు. అలా అని భావించే ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ప్రజలు రెండుసార్లు అవకాశం ఇస్తే.. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారని మండిపడ్డారు.

కాళేశ్వరంపై ప్రజల అనుమానాలు నివృత్తిచేయాలని మా ప్రభుత్వం భావించింది. శాసనసభ, ప్రజా కోర్టులో చర్చిద్దామని ఆహ్వానించాం. కాలు విరిగిందని శాసనసభకు రాలేని కేసీఆర్‌.. నల్గొండ సభకు ఎలా వెళ్లారు. కేసీఆర్‌ దోపిడీకి కాళేశ్వరం బలైపోయింది. అడిగితే సలహాలు ఇస్తానన్న కేసీఆర్‌ ..కేఆర్‌ఎంబీపై చర్చ పెడితే అసెంబ్లీకి ఎందుకు రాలేదు. సభలో చేసిన తీర్మానం చక్కగా లేదని విమర్శిస్తున్నారు. అలాంటి తీర్మానానికి హరీశ్‌రావు ఎందుకు మద్దతిచ్చారు. ఆయన మాటలకు విలువ లేదా? కేసీఆర్‌ బెదిరించి బతకాలని చూస్తున్నారు.

సీఎం కుర్చీ పోగానే.. నీళ్లు, ఫ్లోరైడ్‌ బాధితులు గుర్తొచ్చారా? కాలు విరిగిందని సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వచ్చేందుకు కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించింది కేసీఆరే. ప్రాజెక్టులను కేంద్రం నిర్వహించేందుకు గత ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చింది. సాగునీటి శాఖపై అసెంబ్లీలో శ్వేతపత్రం పెడతాం.. కేసీఆర్‌ వచ్చి మాట్లాడాలి. ప్రజల కోసం బయటికి వెళ్లే అలవాటు కేసీఆర్‌కు ఏనాడూ లేదు. ఎంపీ ఎన్నికల్లో కొన్ని ఓట్లు తెచ్చుకునేందుకు కొత్త ఎత్తుగడ ఎత్తుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

కుంగింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. తెలంగాణ ప్రజల నమ్మకం. మేడిగడ్డపై సీబీఐ కంటే ఉన్నతమైన విచారణ కోరాం. న్యాయస్థానాలపై బీజేపీ నేతలకు నమ్మకం లేదా? సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని మేం భావించాం. సీబీఐ విచారణ జరిపించి కేసీఆర్‌ను రక్షించాలని చూస్తున్నారు. ప్రాజెక్టు సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు. వరంగల్‌కు వచ్చిన కిషన్‌రెడ్డి ఇక్కడికి ఎందుకు రాలేదు. సాంకేతిక నిపుణులతో చర్చించాకే మేడిగడ్డ పునర్నిర్మాణంపై మా నిర్ణయం చెప్తాం. అక్రమాలకు బాధ్యులపై విచారణ కొనసాగుతోంది. అవసరమైతే రెవెన్యూ యాక్టుతో సొమ్ము రికవరీ చేస్తాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.