Tamil Nadu Chief Minister MK Stalin. Credits: PTI

Chennai, May 20: చెన్నై విమానాశ్రయం, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఇంటిలో బాంబు పెట్టినట్లు బెదిరింపు సమాచారం ఇచ్చిన తిరునల్వేలికి చెందిన యువకుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. చెన్నై పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు మంగళవారం మధ్యాహ్నం ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి విమానాశ్రయం, సీఎం ఇంటికి (CM M K Stalin's house)బాంబు పెట్టినట్లు చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు.సీఎం ఇంటి వద్ద బాంబులు పెట్టినట్లు, కొద్దిసేపట్లో అవి పేలనున్నాయని (hoax bomb call), చేతనైతే అడ్డుకోవాలని ఫోన్ లో ఎగ్మూర్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు తెలిపాడు.

దీంతో పోలీసులు సీఎం ఇంటితో పాటు విమానాశ్రయంలో బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీ చేశారు. అక్కడ బాంబు లేదని తెలిసింది. తప్పుడు సమాచారం ఇచ్చిన తిరునల్వేలి జిల్లా సుందమల్లి గ్రామానికి చెందిన తామరై కన్నన్‌ (25)ను ఫోన్‌ కాల్‌ ఆధారంగా అరెస్టు (32-year-old man held ) చేశారు. తామరై కన్నన్‌ ఆకతాయితనంతో బాంబు పెట్టినట్లు ఫోన్‌ చేశాడని తేలింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి చెన్నైకి తీసుకొచ్చి విచారిస్తున్నారు.. గంజాయి మత్తులో అతడు ఈ బెదిరింపునకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

దేశంలో 5జీ విప్లవం, 5జీ టెస్ట్‌ కాల్‌ విజయవంతం, ఐఐటీ మద్రాస్‌లో పరీక్షించిన కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, సంవత్సరం చివరి నాటికి అందుబాటులోకి..

ఇదిలా ఉంటే బెంగళూరు నగరంలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం బాంబు బెదిరింపులు రావడంతో భద్రతను పెంచారు.బెంగళూరు విమానాశ్రయంలో అదనపు సాయుధ పోలీసు బలగాలను మోహరించారు.శుక్రవారం ఉదయం బెంగళూరు విమానాశ్రయం కంట్రోల్ రూంకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.‘‘శుక్రవారం తెల్లవారుజామున కంట్రోల్ రూమ్‌కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మరిన్ని వివరాలు తర్వాత పంచుకుంటాం’’ అని బెంగళూరు పోలీసులు తెలిపారు.బెదిరింపు కాల్‌తో విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, డాగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించాయి.విమానాశ్రయంలో పోలీసులు అలర్ట్ ప్రకటించారు.