MK Stalin (Photo Credit: ANI)

Chennai, August 7: తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటలకు ముగియనుంది. అయితే కరోనా కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో స్టాలిన్ సర్కారు అదనపు ఆంక్షలు విధిస్తూ లాక్‌డౌన్‌ను (Tamil Nadu extends lockdown) ఈ నెల 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడిగించింది. అదేవిధంగా వారాంతం మూడు రోజులు ప్రార్థనాలయాల్లోకి భక్తుల ప్రవేశంపై నిషేధం (adds more restrictions) విధించింది. ఈ నెల 16 నుంచి వైద్య, నర్సింగ్‌ కళాశాలలకు అనుమతి ఇచ్చింది.

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుక్రవారం చెన్నై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వైద్య నిపుణులతో కలిసి జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు, వ్యాక్సినేషన్, అవగాహనా కార్యక్రమాలు, క్వారంటైన్‌ జోన్ల స్థితిగతులపై సమీక్షించారు. అనంతరం లాక్‌డౌన్‌ను ఈ నెల 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

త్వరలో మరో వ్యాక్సిన్ కోర్బివాక్స్‌ అందుబాటులోకి, టీకా తయారీకి ప్రభుత్వం మద్దతిస్తుందని తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవియా, దేశంలో తాజాగా 38,628 కరోనా కేసులు

రాష్ట్రంలో పాఠశాలలు తెరవాల్సిన ఆవశ్యకతను వైద్య నిపుణులు ముఖ్యమంత్రికి (CM MK Stalin) వివరించారు. నెలల తరబడి ఇళ్లలోనే ఉంటూ ఆన్‌లైన్‌ పాఠాలు వినడం వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుందని వివరించారు. అంతేగాక ఆన్‌లైన్‌ క్లాసులు అందరికీ అందుబాటులో లేవని పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలను విన్న సీఎం స్టాలిన్‌ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 9, 10, 11, 12 తరగతులను ఒకే సమయంలో 50 శాతం మంది విద్యార్థులతో నిర్వహించాలని, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్కూ ళ్లు తెరవవచ్చని చెప్పారు. స్కూళ్లు తెరిచే విషయంలో చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. వైద్య, నర్సింగ్‌ కళాశాలలు, వైద్య సంబంధిత కాలేజీలు ఈ నెల 16వ తేదీ నుంచి పనిచేసేందుకు అనుమతించారు.

దూసుకొస్తున్న మిరినే ఉష్ణమండల తుఫాను, టోక్యో ఒలింపిక్స్‌‌కు అంతరాయం ఏర్పడే అవకాశం, రుక్యు దీవుల దగ్గర మిరినే పుట్టే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ

విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చే ప్రయాణికులకు ‘ర్యాపిడ్‌ కరోనా టెస్ట్‌’ పరికరం ద్వారా పరీక్షలు జరిపి 30 నిమిషాల్లోనే ఫలితాలు అందించే విధానాన్ని చెన్నై విమానాశ్రయంలో ప్రవేశపెట్టారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి రూ.900 వసూలు చేసి ఆరీ్టపీసీఆర్‌ పరీక్షలు చేసే విధానం కొంతకాలంగా కొనసాగుతోంది. ఫలితాల వెల్లడికి సుమారు 4 గంటలు పడుతోంది. ఇకపై అంత జాప్యం ఉండదని, ‘ర్యాపిడ్‌ కరోనా టెస్ట్‌’ పరికరాన్ని శుక్రవారం నుంచి అందుబాటులోకి తెచ్చామని చెన్నై విమానాశ్రయ అధికారి తెలిపారు.