Tamil Nadu Hooch Tragedy (photo-ANI)

Chennai, June 20: తమిళనాడు (Tamil Nadu)రాష్ట్రంలోని కళ్లకురిచి (Kallakurichi)లో నాటు సారా తాగిన (Toxic Alcohol) ఘటనలో మృతుల సంఖ్య 34కు పెరిగింది. మరో 60 మందికిపైగా కళ్లకురిచి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం వారిని పుదుచ్చేరిలోని జిప్మర్‌ ఆస్పత్రికు తరలించారు.  వీడియో ఇదిగో, దొంగతనం చేశాడనే అనుమానంతో నడిరోడ్డు మీద ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపేసిన గుంపు

ఈ ఘటనపై సీఎం స్టాలిన్‌ (MK Stalin) స్పందించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు. మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు, అదేవిధంగా చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి గోకుల్‌ దాస్‌ నేతృత్వంలో కమిటీని వేశారు. నాటు సారా అంశంపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించారు.ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.

Here's ANI Tweet and Videos

వారి నుంచి 200 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.కళ్లకురిచి కలెక్టర్‌పై సీఎం బదిలీ వేటు వేశారు. జిల్లా ఎస్పీ సమయసింగ్‌ మీనాను సస్పెండ్‌ చేశారు. వీరితోపాటు మరో 9 మందిని కూడా సస్పెండ్‌ చేశారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు, పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించాలని ఇద్దరు మంత్రులను ఆదేశించారు.