Chennai, April 21: తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై కొందరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బస్సులో వెళుతున్న యువకుడిని కిందికి లాగి లైంగికదాడి చేసి, ఆ దృశ్యాలను వీడియో తీసి రూ. 75 వేలు డబ్బులు వసూలు చేసిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల కథనం మేరకు... తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మణప్పారైకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి(27) పుత్తానందం నుంచి మణప్పారైకు బస్సులో వెళ్తున్నారు. వండిపేట్టైకు చెందిన అరివళగన్ (27) కూడా అందులో ఉన్నాడు. అకస్మాత్తుగా అరివళగన్ తన స్నేహితులకు ఫోన్ చేసి ఐటీ ఉద్యోగి తనతో గొడవ పడ్డాడని, మణప్పారై వద్ద ఉన్న కొలను వద్దకు రావాలని చెప్పాడు. ఈ మేరకు ఐదుగురు వచ్చాక ఆ ఉద్యోగిని బస్సు నుంచి బలవంతంగా కిందికి దింపారు. సమీపంలోని కొలను వద్దకు తీసుకెళ్లారు.
ప్రియురాలి మేనమామను కత్తితో నరికిన ప్రియుడు, మేనకోడలిని ఇంటికి తీసుకువెళతానని చెప్పడంతో ముదిరిన గొడవ
అక్కడ సేతురత్నపురానికి చెందిన రియాజ్ (24) అనే వ్యక్తి ఇంజనీర్‌పై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి రూ.75 వేల నగదు ఇవ్వాలని బెదిరించారు. చేసేదేమీ లేక బాధితుడు నగదు వారికి పంపారు. తరవాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముహమ్మద్ రియాజ్, అరివళగన్, అరుణ్‌కుమార్, లియోబ్లాయిడ్, సెంథిల్‌కుమార్ తదితర ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో రియాజ్, సెంథిల్‌కుమార్‌లు గతంలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలడంతో పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.