New Delhi, Nov 3: ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ మోసాలు విరివిగా జరుగుతున్నాయి. తాజాగా ఓ వృద్ధుడు ఆన్ లైన్ మోసం బారీన పడి భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. వీడియో కాల్ కోసం ఆశపడి ఏకంగా రూ. 13 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే..ఢిల్లీకి చెందిన ఓ వృద్దుడికి వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్ ఎత్తగానే ఓ యువతి నగ్నంగా కనిపించడంతో వృద్దుడు కూడా అసభ్యకర స్థితిలో ఆమెతో వీడియో కాల్ మాట్లాడాడు.
ఆ యువతి వెంటనే ఫోటోస్క్రీన్‌షాట్‌ను తీసి బెదిరింపులకు దిగింది. అయితే ఆ వృద్ధుడు అడిగిన మొత్తం ఇవ్వకపోవడంతో మరింతగా బెదిరింపులకు దిగారు. స్క్రీన్‌షాట్‌లో ఉన్న మహిళ ఉరి వేసుకుని మృతిచెందినట్లుగా బాధితుడి వాట్సాప్ లో ఫోటో పంపారు. నిందితులు మళ్లీ బెదిరించడంతో ఆ వృద్ధుడు భయంతో రూ 12 లక్షల 80 వేలు వారికి ట్రాన్స్‌ఫర్ చేశాడు.
అనంతరం మోసపోయాయని గ్రహించిన వృద్ధుడు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు ఆధారంగా అల్వార్‌కు చెందిన ఖాన్‌ను తొలుతు అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమీషనర్ రోహిత్ మీనా తెలిపారు. అతనితో పాటుగా ఈ కేసులో రాజస్థాన్ కు చెందిన భర్కాత్ ఖాన్, రిజ్వాన్‌ను ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను రికవర్ చేశారు. వీడియో కాల్స్ చేసి జనం నుంచి డబ్బులు వసూల్ చేస్తున్న ఈ ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు వారిని పట్టుకొని విచారిస్తున్నారు.