Chennai, December 23: చూడగానే ముద్దొచ్చేలా ఉన్న చిన్న జంతువులను స్మగ్లింగ్ చేస్తూ తమిళనాడులో (Tamil Nadu) ఓ స్మగ్లర్ ఇంటలిజెంట్ ఆఫీసర్లకు దొరికిపోయాడు. బ్యాంకాక్ నుంచి వచ్చి చెన్నైలో దిగిన భారత్ కు చెందిన ఓ ప్రయాణీకుడు ఈ అరుదైన జంతువులను బ్యాగులో పెట్టుకుని చెన్నై ఎయిర్‌పోర్టులో (Chennai airport) కనిపించాడు. అతను ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా కనిపించడంతో ఇంటలిజెన్స్ అధికారులు అతడిని తనిఖీ చేశారు.
ఆ ప్రయాణికుడి లగేజీలో కొన్ని బుట్టల్లో వివిధ జంతుజాతుల పిల్లలు ఉన్నాయి. అందులో వింతగా ఉన్న 12 కంగారూ పిల్లలు, 3 ప్రైరీ డాగ్స్,(Kangaroo rats, prairie dogs) 1 ఎర్రని ఉడత పిల్ల, 5 అరుదైన జాతులకు చెందిన పిల్లలున్నాయి. అధికారులు వాటిని సీజ్ చేసి, తిరిగి వాటిని బ్యాంకాక్ పంపించారు.
ANI Tweet
Tamil Nadu: Air Intelligence Unit at Chennai airport has detained an Indian passenger, coming from Bangkok, and seized 12 Kangaroo Rats, 3 Prairie Dogs, 1 Red Squirrel and 5 Blue Iguana lizards from his possession. The rodents and reptiles are being sent back to Bangkok. pic.twitter.com/Sbgn2SJoLo
— ANI (@ANI) December 22, 2019
కాగా అవి చాలా విలువైన జాతికి చెందినవిగా కనిపిస్తున్నాయి. చూడగానే చాలా ముద్దొచ్చేలా ఉన్నాయి. మరి ఆ జంతువులను ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారనే దానిపై ఇంకా సమాచారం అందలేదు. అవి బ్యాంకాక్ లో ఎక్కడ నుంచి తీసుకువచ్చారనే దానిపై సరైన సమాచారం లేదు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.