Road accident (image use for representational)

Chennai,Nov9:  తెల్లవారు జామున తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం (Tamil Nadu Road accident) చోటు చేసుకుంది. పనికి వెళ్లేందుకు కూలిలను తరలిస్తున్న ఓ వాహనం తమిళనాడు అంతియూర్ కొండల్లో (Tamil Nadu Anthiyur) ఆదివారం ఉదయం బొల్తా పడింది. అధిక లోడింగ్‌తో వెళ్తున్న ఈ వాహనం అదుపు తప్పి బొల్తా పడటంతో నలుగురు కూలీలు (Four labourers died) సంఘటనా స్థలంలో మరణించారు. మరో 11 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈరోడ్‌ జిల్లా అంతియూర్ సమీపంలోని బర్గూర్‌ కొండ మార్గంలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన వారివి అనేక తోటలు ఉన్నాయి. ఈ తోటల్లోకి పనిచేసే కూలీలను ప్రతి రోజూ వాహనాల్లో తరలిస్తుంటారు. ఆదివారం ఉదయం కూడా తంబురెడ్డి పట్టి గ్రామానికి చెందిన 15 మంది కూలీలతో టాటా సుమో వాహనం బయలు దేరింది. అయితే సామర్థ్యానికి మించి ఓవర్‌ లోడింగ్‌తో కొండ మార్గంలో వెళ్తున్న ఈ చిన్న వాహనం మణియాచ్చి పల్లం వద్ద అదుపు తప్పింది. కొండ మీద నుంచి ఫల్టీ కొడుతూ కింద రోడ్డు మీద పడింది.దీంతో వాహనంలో ఉన్న కూలీలు ఎగిరెగిరి ఎక్కడో పడ్డారు. పైగా దట్టమైన పొదళ్లతో నిండిన ఈ మార్గంలో ఎవరు ఎక్కడ పడ్డారో తెలియలేదు.

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు అక్కడికక్కడే మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అటు వైపుగా వచ్చిన వాహన దారులు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉంటే కొండ మార్గంలోకి అంబులెన్స్‌ రావడం కష్టతరంగా మారింది. అతి కష్టం మీద అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌ వాహనాలు, పోలీసు వాహనాల్లో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం అంతియూర్, బర్గూర్‌ ఆస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఈరోడ్‌లోని పలు ప్రైవేటు ఆస్పత్రులకు గాయపడ్డ వాళ్లను తరలించారు.

సంఘటనా స్థలంలోనే తంబురెడ్డి పట్టి గ్రామంకు చెందిన దేవరాజ్‌(45), చిక్కన్న(45), తోటప్పి (45), జగన్‌(35)లు మరణించారు. మిగిలిన 11 మంది తీవ్ర చికిత్స సాగుతున్నది. ఈ ప్రమాద సమాచారంతో తంబురెడ్డి పట్టి లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.