Cuddalore, April 17: తమిళనాడులోని కడలూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఆరు నెలలుగా ఓ బాలికపై జరుగుతున్న దారుణం (Cuddalore Shocker) తాజాగా వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికను బెదిరించిన ఐదుగురు యువకులు ఆరు నెలులగా ఆమెపై అత్యచారానికి పాల్పడుతున్నారు. తాజాగా నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ (3 Accused Arrested) చేశారు. నిందితులు 19 నుంచి 21 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు.
బాధిత బాలిక తన బాబాయి ఇంట్లో ఉన్న సమయంలో నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అరెస్ట్ చేసిన ముగ్గురిని ఎన్.ధీన (21), ఎస్.విగ్నేష్ (19), వి.హోనెస్ట్ రాజ్ (21)గా గుర్తించారు.బాలిక ఆరోగ్యం క్షీణించడంతో యువకులు చేస్తున్న దారుణం (5 Men Sexually Abuse Minor Girl) వెలుగులోకి వచ్చింది. బాలిక దిగాలుగా ఉండడం, అనారోగ్యం పాలు కావడంతో ఏం జరిగిందని బాబాయి ప్రశ్నించగా బాలిక చెప్పింది విని హతాశుడయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాలిక తండ్రి చెన్నైలో పనిచేస్తుండగా, బాధితురాలు కడలూరులోని తన బాబాయి ఇంటి వద్ద ఉంటోంది. నిందితులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న రంజిత్, రంగా కోసం గాలిస్తున్నారు.