
Chennai, August 9: తమిళనాడులోని రామనాథపురం జిల్లా రామేశ్వరంలో దారుణ ఘటన (Tamil Nadu Shocker) చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలపై చర్చి పాస్టర్‌ను అరెస్టు (Pastor arrested) చేశారు. చర్చికి వచ్చే యువతులను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలపై జాన్ రాబర్ట్ అనే పాస్టర్‌ని అరెస్టు చేశారు.రామేశ్వరం మండపం ప్రాంతంలోని పునీతర్ అరుల్ ఆనందర్ చర్చిలో పాస్టర్ ఈ దారుణానికి (sexually harassing girls) ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.
లైంగిక వేధింపులకు గురైన బాధితులు ఘటనపై ఫిర్యాదు చేసేందుకు శిశు సంక్షేమ అధికారులను సంప్రదించారు. దీని ఆధారంగా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు జాన్ రాబర్ట్, ఆరోపణలపై రహస్యంగా విచారణ చేపట్టారు.చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న జాన్ రాబర్ట్ బాలికలను లైంగికంగా వేధించాడని విచారణలో నిర్ధారించిన తరువాత, శిశు సంక్షేమ అధికారులు పాస్టర్‌పై మండపం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.పోలీసులు పాస్టర్‌ని అరెస్టు చేసి, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు.తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.