Tejashwi Yadav (Photo-ANI)

Chennai, DEC 24: ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడే ప్రజలు తమిళనాడులో (Tamilnadu) టాయిలెట్లు కడుగుతారంటూ డీఎంకే ఎంపీ దయానిధి (Dayanidhi) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజశ్వీ కౌంటర్ (Tejashwi Yadav Reaction) అటాక్ చేస్తూ.. ‘‘మా వాళ్ళు పని మానేస్తే దేశం అంతా స్తంభించిపోతుంది. ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలి’’ అని తేజశ్వీ అన్నారు. దయానిధి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

CM Revanth Reddy: అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్.. రోజుకు 18 గంటలు పని చేయండి.. లేదంటే బాధ్యతల నుంచి తప్పుకోండి... 

ఇంతకు ముందు దయానిధి మారన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి హిందీ ప్రజలు తమిళనాడుకు వచ్చి ఇక్కడ నిర్మాణ, రోడ్డు పని కార్మికులుగా లేదా మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులుగా పని చేస్తున్నారని ఆయన అన్నారు. డీఎంకే ఎంపీ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యతో కూడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Mumbai Firing: ముంబైలో కాల్పుల కలకలం, 16 రౌండ్లు ఫైర్ చేసిన వ్యక్తి, ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు  

హిందీ మాట్లాడే వారిపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ పాలిత రాష్ట్రాలు గోమూత్ర రాష్ట్రాలంటూ డీఎంకే నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ వివాదం ముగియకముందే దయానిది రంగంలోకి దిగారు. దీనిపై ఉత్తరాది నేతల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. డీఎంకే భాగమైన ఇండియా కూటమిలోని మిత్రపక్ష పార్టీల నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.