Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Hyderabad, December 15: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ (Hyderabad Encounter) ఘటన తర్వాత కూడా మృగాళ్లలో మార్పు కనపడటం లేదు. హైదరాబాద్‌ పాతబస్తీ (Hyderabad)లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కాచెళ్లెళ్లపై కన్నేసిన కామాంధులు గదిలో నిర్బంధించి అఘాయిత్యానికి ఒడిగట్టారు. కాళ్లావేళ్లా పడ్డ కనికరించని కిరాతకులు... బలవంతంగా తమ కామవాంఛ తీర్చుకున్నారు.

ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వదిలిపెట్టారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో.. ఆ మృగాళ్లు ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నారు. విచిత్రం ఏమిటంటే దిశ ఘటనలో నిందితులు లారీ వాళ్లు కాగా, ఇక్కడ ఆటోవాలాలు...

పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో (Chandrayangutta) రాత్రి రోడ్డుపై నిలబడ్డ ఇద్దరు అక్కాచెళ్లెళ్లు తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు రోడ్డు మీద నిలబడి ఉన్నారు. వారి దగ్గరకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలని అడిగారు. జాహంగీర్ పీర్ దర్గా వద్ద ఉన్న తమ బంధువుల ఇంటికి వెళుతున్నామని చెప్పడంతో ఆటోలో దింపుతామంటూ నమ్మించారు. కొంత దూరం వెళ్లాక రాత్రివేళల్లో అక్కడికి వెళ్లడం మంచిది కాదని.. ఇటీవలే దిశ (Disha)అనే అమ్మాయిని రేప్ చేసి చంపేశారంటూ నమ్మబలికారు.

అక్కాచెళ్లెళ్లకు మాయమాటలు చెప్పి మూసా ఇంటికి తీసుకువెళ్లారు. వారిని గదిలో నిర్బంధించి తరువాత ఇద్దరిపై అఘాయిత్యానికి (Auto Driver Rapes Girls) పాల్పడ్డారు. కనికరం కూడా చూపకుండా ఆ కసాయిలు ఇద్దరికీ చిత్రహింసలు పెట్టారు. కామ వాంఛ తీర్చుకున్న తరువా వారిద్దరిని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో (Nampally railway station) వదిలి పారిపోయారు.

తమ ఇద్దరు పిల్లలు ఇంటికి రాకపోవడంతో బాలికల తల్లిదండ్రులు చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. అన్ని పోలీస్‌స్టేషన్‌లలో లుక్ అవుట్ నోటీస్‌తో పాటు పెట్రొలింగ్ గస్తీ టీమ్‌ను రంగంలోకి దింపారు.

నాంపల్లి రైల్వేస్టేషన్‌ అక్కాచెళ్లెళ్లు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఆటోడ్రైవర్ల అఘాయిత్యాలు బయటపడ్డాయి.

దీంతో మరోసారి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలికలను ఆసుపత్రికి తరలించిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా ఆటో నెంబర్ కనుగొన్నారు. ఘాతుకానికి పాల్పడిన కామాంధులు మూసా, అమీర్‌లను అరెస్టు చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ తరలించారు. అటోతోపాటు నిందితుల సెల్‌ఫోన్లను సీజ్ చేశారు.