Terror attack in Baramulla: వారంలోనే 3సార్లు జవాన్లపై ఉగ్రదాడి, బారాముల్లా జిల్లాలో తాజాగా సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర‌వాదుల దాడి, అమరులైన ఇద్ద‌రు సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు, ఓపోలీసు ఉన్న‌తాధికారి
Terrorist attack (Photo Credits: PTI) Image used for representational purpose only

Srinagar, August 17: జ‌మ్ముక‌శ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమ‌వారం సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర‌దాడి (Terror attack in Baramulla) జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు స‌హా ఓ పోలీసు ఉన్న‌తాధికారి అమరులయ్యారు. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ వాహనం నుంచి బయటికి దిగుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్ర‌దాడిలో గాయ‌ప‌డిన వారిని ఇప్ప‌టికే ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు పేర్కొన్నారు. ఉగ్ర‌వాద క‌ద‌లిక‌ల‌పై నిఘా పెట్టామ‌ని తెలిపారు.

జ‌మ్ము క‌శ్మీర్‌లో గ‌త వారంలోనే భ‌ద్ర‌తా ద‌ళాల‌పై ఉగ్ర‌వాదులు జ‌రిపిన మూడ‌వ దాడి (Terror attack) ఇది. ఆగ‌స్టు 14న శ్రీన‌గ‌ర్ న‌గ‌ర శివార్ల‌లోని నౌగాం వద్ద ఉగ్ర‌వాదుల దాడిలో ఇద్ద‌రు పోలీసులు అమ‌రులైన సంగ‌తి తెలిసిందే. దాడి అనంత‌రం ఉగ్ర‌వాదులు పారిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. అంత‌కుముందు శ్రీన‌గ‌ర్- బారాముల్లా హైవేలోని హైగాం వ‌ద్ద సైనికుల బృందంపై ఉద్ర‌వాదులు కాల్పులు జ‌ర‌ప‌గా, ఓ జ‌వాను తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వెంటిలేటర్‌పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, పరిస్థితి విషమంగానే ఉందని తెలిపిన ఆర్మీ ఆస్పత్రి అధికారులు, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపిన అభిజిత్

సీఆర్పీఎఫ్ జవాన్లు తమ వాహనం నుంచి బయటికి దిగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు ఉగ్రవాదుల కోసం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. ఈ దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తమై చేర్పించామని ఉన్నతాధికారులు ప్రకటించారు.