Representational Picture. Credits: Wikimedia Commons

సామన్యులకి టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. టమాటా ధర అమాంతంగా ఒక్కసారిగా రూ.100కి చేరింది. గత మూడు నెలలగా భగ్గుమన్న సూర్యుడి ప్రతాపంతో టమాటా దిగుబడి భారీగా పడిపోగా.. ఇప్పుడు వేసవిలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉన్న కాస్త పంటా దెబ్బతింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో టమాటాకి భారీ డిమాండ్ (Tomato Price Hike) ఏర్పడింది. దీంతో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవడంతో ధర అమాంతం కొండెక్కి (Tomato Prices Are Surging) కూర్చుంది. రైతు బజార్లు, పెద్ద పెద్ద మార్కెట్లలో మంచి టమాటాలు కిలో రూ.80 పలుకుతుంటే చిన్న చిన్న మార్కెట్లలో రూ.100కి చేరింది. సాధారణ రోజుల్లో నగరానికి 80 నుంచి 100 లారీల టమాట దిగుమతి అవుతుంటే ప్రస్తుతం రోజుకు 50 లారీల రావడం కూడా కష్టమైందని మార్కెట్ శాఖ అధికారులు చెబుతున్నారు.

హొల్ సేల్ మార్కెట్‌లోనే కిలో టమాట రూ.50 నుంచి 55 పలుకుతోండగా.. మార్కెట్లలో రూ.80 నుండి రూ.100 పలుకుతుంది. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా టమాటా ధరలు కొండెక్కాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్టయిన మదనపల్లె మార్కెట్లో కిలో టమాటా రూ.60కి చేరితే ఇది వినియోగదారుల వద్దకు చేరేసరికి సెంచరీకి చేరింది. కేరళలో రూ.100 మార్కును చేరింది. ఒడిశాలో రూ.90, కర్నాటకలో రూ.70, ఏపీ, తెలంగాణల్లోనూ రూ.60కి పైగా పెరిగినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక చెప్తోంది.

ఐఆర్‌సీటీసీ నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్ చేస్తున్నారా.. అయితే టిక్కెట్ బుకింగ్ ప్రక్రియలో మార్పులు గురించి మీరు తెలుసుకోవాల్సిందే

టమాటా ఉత్పత్తిలో ముందున్న ఏపీ, ఒడిశాల్లో అసని తుఫాన్‌తో పంట బాగా దెబ్బ తింది. ఏపీలో విశాఖ, కర్నూలు, తిరుపతిల్లో కిలో రూ.50–70 పలుకుతున్నట్టు వినియోగదారుల శాఖ నిత్యావసర సరుకుల ధరల డేటా పేర్కొంది. నిజానికి హోల్‌సేల్‌ మార్కెట్లకు నిత్యం 9వేల బాక్సుల్లో 2.25 లక్షల కేజీల టమాటా వచ్చేది. అప్పుడు ధర రూ.15లోపే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.. కేవలం 3 వేల టమాటా బాక్సులు మాత్రమే వస్తున్నాయి. ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.. మళ్ళీ కొత్త పంట వచ్చేవరకు ఇలాగే ధరలు ఉండొచ్చనని అంటున్నారు.