New Delhi, AUG 26:  దేశంలో నకిలీ విశ్వవిద్యాలయాలు (fake universities) విద్యార్థుల్ని నిలువునా ముంచుతున్నాయి. అనుమతులు లేకుండానే యూనివర్సిటీలు నిర్వహిస్తున్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లు చెల్లవు. దీంతో ఈ యూనివర్సిటీల పరిధిలో చదువు పూర్తి చేసుకున్న చాలా మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ఇలాంటి యూనివర్సిటీలపై యూజీసీ (UGC) దృష్టి పెట్టింది. దేశంలో ఉన్న నకిలీ యూనివర్సిటీల జాబితాను యూజీసీ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 21 నకిలీ యూనివర్సిటీలు (fake universities) ఉన్నట్లు ప్రకటించింది. ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ తర్వాత యూపీలో 4, పశ్చిమ బెంగాల్‌లో 2, ఒడిశాలో 2, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున నకిలీ యూనివర్సిటీ ఉన్నట్లు తెలిపింది.

Maharashtra:  జైల్లోనే కుప్పకూలిపోయిన మ‌హారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ముంబైలోని జేజే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స చేస్తున్న వైద్యులు 

అలాగే వీటితోపాటు ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా ఒక నకిలీ యూనివర్సిటీ ఉన్నట్లు ప్రకటించింది. గుంటూరులోని కాకుమానువారి తోటలో ఉన్న ‘క్రైస్ట్ న్యూ టెస్టిమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ’ని నకిలీ యూనివర్సిటీగా ప్రకటించింది.

CM Hemant Soren Disqualified as MLA: జార్ఖండ్‌లో రాజ‌కీయ సంక్షోభం, సీఎం హేమంత్ సోరెన్ శాస‌న స‌భ్య‌త్వం ర‌ద్దు, సీఎం రేసులోకి వచ్చిన హేమంత్ సోరెన్ భార్య 

ఈ యూనివర్సిటీలకు ఎలాంటి డిగ్రీలు ఇచ్చే అర్హత లేదని, ఇవి జారీ చేసే సర్టిఫికెట్లు చెల్లవని యూజీసీ పేర్కొంది. దేశంలోని ఏ యూనివర్సిటీకైనా అనుమతులిచ్చేది యూజీసీ. నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్న యూనివర్సిటీలకే యూజీసీ అనుమతిస్తుంది. ఆ యూనివర్సిటీలు జారీ చేసే సర్టిఫికెట్లకు మాత్రమే చెల్లుబాటు ఉంటుంది. అందుకే విద్యార్థులు కొత్త యూనివర్సిటీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.