Union Home Minister & BJP leader Amit Shah (Photo-PTI)

New Delhi, August 18: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో రెండు వారాలుగా చికిత్స అందిస్తున్నారు.ఇటీవలే తనకు నెగెటివ్‌ వచ్చిందని, ఈశ్వరుడిని కృతజ్ఞతలు తెలుపుతున్నానని అమిత్ షా ప్రకటన కూడా చేశారు. అయినప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేవరకు మేదాంత ఆసుపత్రిలోనే (Gurugram’s Medanta Hospital) చికిత్స తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఆమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో (Amit Shah Admitted to AIIMS) చేరారు. సోమవారం రాత్రి ఎయిమ్స్‌లో చేరారు. ఎయిమ్స్ డైరెక్టర్ రన్‌దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.

మేదాంత ఆసుపత్రిలో శ్వాస కోస సమస్యతో బాధపడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను అక్కడి నుంచి నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలించారు. ఎయిమ్స్‌లోనే ఇకపై ఆయన చికిత్స తీసుకోనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఆగస్టు 2 న హోం మంత్రికి COVID-19 నిర్ధారణ జరిగింది. వైద్యుల సలహా మేరకు గురుగ్రామ్ యొక్క మెదంత ఆసుపత్రిలో చేరారు. నాకు కరోనా వచ్చిందని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు.