Union Minister Bandi Sanjay Letter To CM Revanth Reddy (video grab)

Hyderabad, OCT 20: పంతాలు, పట్టింపులకు పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్‌ (Union Minister Bandi Sanjay) సూచించారు. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళనపై (Group 1 Aspirants Protest) ఆయన సీఎం రేవంత్‌కు లేఖ (Letter to CM Revanth Reddy) కేంద్రమంత్రి బండి సంజయ్‌ లేఖ రాశారు. రేపు పరీక్షలని తెలిసి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారంటూ అర్థం చేసుకోవాలన్నారు. నిరుద్యోగులంతా మీ కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. గ్రూప్‌-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలన్నారు. జీవో 29 కారణంగా గ్రూప్-1 పరీక్షల్లో 5,003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హలయ్యారన్నారు.

Bandi Sanjay Wrote Letter To Revanth Reddy

 

563 పోస్టులకు 1:50 చొప్పున అభ్యర్థులను ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ మొత్తం పోస్టుల్లో 354 రిజర్వ్ పోస్టులని.. 29 జీవోతో ఓపెన్ కేటగిరిలో అర్హత సాధించిన రిజర్వ్ అభ్యర్థులను సైతం రిజర్వ్ కేటగిరీలో చేర్చడం అన్యాయమన్నారు. ఈ జీవోతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు 1:50 చొప్పున అర్హత సాధిస్తే.. ఓసీ వర్గాలు 1:65 శాతం మేరకు అర్హత సాధించారన్నారు.

Revanth Reddy On Cyber Crimes: పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు.. ఇదొక భావోద్వేగం, కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలను మరిచిపోలేదన్న సీఎం రేవంత్ రెడ్డి 

జీవో నెంబర్ 29 రాజ్యాంగ స్ఫూర్తికి రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు వ్యతిరేకమన్నారు. గ్రూప్-1 అభ్యర్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని.. గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారన్నారు. 29 జీవోతో రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేయబోతున్నారనే చర్చ మొదలైందని.. తక్షణమే 29 జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.