Lucknow, July 22: యూపీలో దుండగుల దాడిలో మరణించిన జర్నలిస్టు విక్రమ్ జోషి కుటుంబానికి ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు ఘజియాబాద్ కలెక్టర్ అజయ్‌శంకర్ పాండే బుధవారం తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఇది చాలా బాధాకర విషయమన్నారు. జర్నలిస్టు మృతికి (Journalist Vikram Joshi Death) సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) నివాళులర్పించినట్లు తెలిపారు. శివాలయంలో సాధువుల దారుణ హత్య, యుపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్‌కి కాల్ చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే
తాము విక్రమ్ జోషి కుటుంబాన్ని కలిసి పరామర్శించి, కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు తెలిపారు. రూ.10లక్షలు తక్షణ సాయంగా అందజేసి విక్రమ్ భార్యకు తగిన విధంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, విక్రమ్ కూతుళ్లను మంచి పాఠశాలలో చదివిస్తామని భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఘజియాబాద్ ఎస్పీ కళానిధి నైతాని మాట్లాడుతూ జర్నలిస్టు విక్రమ్ జోషి హత్య (Journalist Vikram Joshi Murder) విషయమై సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేశామని, ప్రధాన నిందితులైన రవి, చోటులను కూడా అదుపులోకి తీసకున్నట్లు తెలిపారు. ఇద్దరు పోలీసులను సస్సెండ్ చేశామని తెలిపారు.
Here's CCTV footage
CCTV footage of journalist Vikram Joshi in UP's Ghaziabad waylaid by armed assailants, assaulted in the middle of a busy street and shot at in the head. Joshi, in critical condition now, had recently made a police complaint against local goons for harassing her niece. pic.twitter.com/yiCkKJgWQ9
— Piyush Rai (@Benarasiyaa) July 21, 2020
Ghaziabad police arrested five people invovled in the attack on journalist Vikram Joshi. pic.twitter.com/waLEdGXVxp
— Saurabh Trivedi (@saurabh3vedi) July 21, 2020
ఈ హత్యకు రవి ప్లాన్ చేయగా చోటు విక్రమ్‌పై కాల్పులు జరిపాడన్నారు. వారి వద్దనున్న పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం తీసుకొని వారికి ఎలాంటి హానీ జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. యుపీలొ ఇద్దరు సాధువుల దారుణ హత్య, మహారాష్ట్ర ఘటన మరువక ముందే మరో విషాద ఘటన, ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న విక్రమ్ జోషి (Journalist Vikram Joshi) సోమవారం రాత్రి ఇంటికి తిరిగి వెళుతుండగా దుండగులు అతనిపై దాడి చేశారు. తన మేనకోడలిని కొందరు యువకులు వేధిస్తున్నారని విక్రమ్ జోషి నాలుగు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆ యువతిని వేధించిన వారే హత్యకు పాల్పడి ఉంటారని విక్రమ్ జోషి సోదరుడు పేర్కొన్నారు. జర్నలిస్ట్ ద్విచక్రవాహనంపై ఇంటికి చేరుకునే సమయంలో దుండగులు ఆయనను చుట్టుముట్టి దారుణంగా కొడుతున్న దృశ్యాలు సీసీటీవీలో (CC TV Record) రికార్డయ్యాయి.
జోషి కుమార్తెలు భయంతో పరుగులు పెట్టి సాయం కోసం అర్ధిస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఇద్దరు కుమార్తెల ఎదుటే జర్నలిస్ట్ విక్రమ్ జోషిపై నిందితులు కాల్పులు జరిపారు. జోషి తలపై బుల్లెట్ గాయాలయ్యాయి. దుండగుల కాల్పుల్లో గాయపడిన జోషిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గాయపడిన జర్నలిస్ట్ బుధవారం ఉదయం మరణించారు.