Lucknow, July 05: చిన్న చిన్న కారణాలకే పెళ్లిళ్లు ఆగిపోతున్న టైం ఇది. అలాంటిది ఏకంగా పెళ్లికూతురు తల్లి పెళ్లివేడుకల్లోనే సిగిరెట్ తాగితే ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు. తనకు కాబోయే అత్తగారు సిగరెట్ (Smoking) తాగుతూ డాన్స్ చేయడాన్ని చూసిన పెండ్లి కొడుకు తనకీ పెళ్లి వద్దంటూ వెళ్లిపోయాడు. యూపీలోని సంభాల్ జిల్లాలో (Sambal) ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి పెళ్లి నిశ్చయమైంది. జూన్ 27న కల్యాణ మండపానికి చేరిన వరుడు వివాహానికి మందు జరిగిన వేడుకలో తన కాబోయే అత్తగారు సిగరెట్ (Smoking) తాగుతూ డాన్స్ చేయడాన్ని చూసి షాక్ తిన్నాడు. సభ్యత, సంప్రదాయం లేకుండా సిగరెట్ తాగడమేమిటని ఆగ్రహించిన పెండ్లి కొడుకు వెంటనే వేడుకను నిలిపివేయించి పెళ్లిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి తన బంధువులతో మండపం నుంచి నిష్క్రమించాడు.
కాగా, గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి వరుడికి నచ్చజెప్పడంతో వివాహానికి ఒప్పుకున్నాడు. గతంలో కూగా పెళ్లికొడుకు తాగాడని, అతను నిద్రపోతున్నాడని ఇలా పలు కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలున్నాయి. కానీ పెళ్లికూతురు తల్లి ఇలా చేయడంపై సంబాల్ జిల్లాలో చర్చ జరుగుతోంది. కూతురు పెళ్లిలో ఇలాంటి పనులేంటని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.