Uttar Pradesh: కూలీ పని చేసుకునే వ్యక్తి అకౌంట్లో రూ. 2700 కోట్లు, ఒక్కసారిగా ఖంగుతిన్న దినసరి కూలీ, అతని అకౌంట్‌ని సీజ్ చేసిన అధికారులు
Image used for representational purpose | (Photo Credits: PTI)

Lucknow, July 3: ఉత్తర ప్రదేశ్‌లో విచిత్రకర ఘటన చోటుచేసుకుంది.ఓ దినసరి కూలీ (UP Labourer) కూడా క్షణాల్లో కోటీశ్వరుడిగా మారిపోయాడు.ఆ కూలి అకౌంట్‌లోఊహించని మొత్తంలో అమౌంట్‌ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. చివరికి అసలు విషయం తెలిసి పాపం ఖంగుతున్నాడు. కన్నౌజ్‌ జిల్లాకు చెందిన 45 ఏళ్ల బిహారీ లాల్‌ ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్నాడు. తన జన్‌ ధన్‌ ఖాతా నుంచి రూ. 100 విత్‌డ్రా చేయడానికి ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ వంద రూపాయలు డ్రా చేసిన తరువాత అతనికి ఒక మెసెజ్‌ వచ్చింది. ఇంకా అకౌంట్‌లో రూ. 2,700 కోట్లు (Rs 2,700 Crore in Bank Account) ఉన్నట్లు మెసెజ్‌లో చూపించింది.

షాక్‌ తిన్న బిహారీ లాల్‌.. బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ తీసి చూశాడు. అందులోనూ రూ. 2 వేల 7 వందల కోట్లు ఉన్నట్లుగానే కనిపించింది. వెంటనే బ్యాంక్‌ దగ్గరకు పరుగెత్తుకెళ్లి అధికారులకు ఈ విషయం చెప్పాడు. అధికారులు తనిఖీ చూస్తే బ్యాలెన్స్‌ కేవలం రూ.126 ఉన్నట్లు చూపించింది. దీంతో అవాక్కైన బిహారీ లాల్, తన అకౌంట్లో రూ.2700 కోట్లు చూపించిందని చెప్పాడు.

ఇంతకంటే పిచ్చి పని మరోటి ఉండదు.. వంటల పోటీలో గెలవడానికి వృషణాలతో పాస్తా వండి వడ్డించిన అమెరికన్ లేడీ.. తర్వాత ఏమైందంటే?

అయితే అదంతా సాంకేతిక తప్పిదం అయ్యుంటుందని అధికారులు చెప్పడంతో నిరాశగా వెనుదిరిగాడు. అయితే బిహారీలాల్‌ అకౌంట్‌ను సీజ్ చేశామని, ఈ విషయాన్ని సీనియర్ అధికారులకు తెలియజేశామని బ్యాంక్‌ వాళ్లు చెప్పారు.