Lucknow, Jan 25: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్త ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికి ( Chops Body Into 15 Pieces) వాటిని రహస్య ప్రదేశంలో పడేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మిలాల్ ప్రజాపతి అనే వ్యక్తి ఘజియాబాద్‌లో రిక్షా తొక్కుతూ తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. స్థానికంగా నివసిస్తున్న రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీకి చెందిన అక్షయ్ కుమార్ కూడా అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు.
అతనికి తన భార్యకు మధ్య వివాహేతర సంబంధం ఉందని అతడు అనుమానించాడు. ఈ నేపథ్యంలో గురువారం అతడ్ని ఇంటికి పిలువాలని భార్యతో చెప్పాడు. ఆమె ఫోన్ చేసి చెప్పడంతో గురువారం సాయంత్రం అతడు వచ్చాడు.ఈ నేపథ్యంలోనే కుమార్తె కాలికి గాయమయింది. కూతురును తీసుకుని ప్రజాపతి భార్య ఢిల్లీలోని ఆసుపత్రికి వెళ్లింది. అప్పటికే ఇంటికి వచ్చిన అక్షయ్ కుమార్‌తో కలిసి ప్రజాపతి మద్యం తాగించాడు. ఆ తర్వాత రాత్రి వేళ గొడ్డలితో దాడి చేసి అతడ్ని దారుణంగా హత్య (Man Kills Wife's Lover) చేసి.. మృతదేహాన్ని 15 ముక్కలుగా సరికాడు.
వాటిని మూడు బ్యాగుల్లో ఉంచాడు. శుక్రవారం తెల్లవారుజామున 1 గంటకు తన రిక్షాలో తీసుకెళ్లి ఖోడా కాలనీ ప్రాంతంలో పడేశాడు.ఈ ఘటనపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్షయ్ మృతదేహం ముక్కలు ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. అక్షయ్ కుమార్ హత్యలో నిందితుడి భార్య పాత్ర ఉన్నదా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.