Rep Image (File Image)

ఆధార్ తో పాటు ఇతర ఐడీ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయాలనుకునే వారికి ఇది నిజందగా శుభవార్తే. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధార్ ద్వారా కీలకమైన ప్రభుత్వ డాక్యుమెంట్లను ఆటోమాటిక్ అప్‌డేట్ (automatically update key details) చేసే వ్యవస్థను త్వరలో ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ గుర్తింపు కార్డులలో వేర్వేరు వివరాలు ఉండి వాటిని మార్చుకునేందుకు ఇబ్బంది పడుతున్న వారికి ఊరట కలిగిలించేలా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

పన్ను చెల్లింపుదారులకు మరోసారి అలర్ట్, మార్చి 31వ తేదీలోపు పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించిన ఆదాయపు పన్ను శాఖ

దీని ప్రకారం.. ఆధార్‌ కార్డులో అడ్రస్‌ సహా ఏమైనా వివరాలు తప్పుగా ఉండి వాటిని అప్‌ డేట్‌ చేస్తే (Updating Aadhaar will soon) మిగతా డాక్యుమెంట్లలో మార్పులకై ఆయా కార్యాలయాలకు వెళ్లకుండా అన్నింట్లోనూ ఆటోమెటిక్‌ వివరాలు అప్‌డేట్‌ అయ్యేలా కొత్త వ్యవస్థను మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ విభాగం సిద్ధం చేస‍్తున్నట్లు తెలిపింది. అయితే ఆధార్‌లోని ఇంటి అడ్రస్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు. అయితే DoB (పుట్టిన తేదీ), లింగం, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ID వంటి ఇతర వివరాలు ఆఫ్‌లైన్ కేంద్రాల ద్వారా మాత్రమే అప్‌డేట్ అవుతాయి.

పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి, సెకండ్లలో మీ ఫోన్‌కి మెసేజ్

సాధారణంగా ప్రభుత్వ ఐడీ కార్డ్‌లను డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డ్‌తో పాటు ఇతర డాక్యుమెంట్లను డిజిలాకర్‌ (DigiLocker)లో భద్రపరుచుకుంటుంటారు. ఆ డిజిలాకర్‌లో ఉన్న ఆధార్‌ కార్డులో ఏదైనా అడ్రస్‌ లేదంటే ఇతర వివరాలు మారిస్తే.. వెంటనే డిజి లాకర్‌లో ఉన్న మిగిలిన ఐడెంటిటీ కార్డ్‌లలో డేటా సైతం అటో అప్‌డేట్‌ అవుతుంది.

ప్రస్తుతం, ఈ ఆటో అప్‌డేట్‌పై కేంద్ర ఐటీ శాఖ.. రవాణా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వంటి పరిమిత మంత్రిత్వ శాఖలతో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పాస్‌పోర్ట్‌లను ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయడానికి యూజర్లకు అనుమతి ఇచ్చిన తర్వాత ఆధార్‌ ఆటో అప్‌డేట్‌ విధానం అమల్లోకి రానుంది. గత నెలలో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విధమైన వ్యవస్థను త్వరలో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.