Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, Dec 20: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశలు ఊరట కల్పిస్తున్న నేపథ్యంలో కొన్ని వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో ఫైజర్-బయోఎన్‌టెక్, మెడర్నా వ్యాక్సిన్లకు రెగ్యులేటరీ అనుమతి లభించిన విషయం విదితమే. క్లినికల్ ట్రయల్స్ నుండి సేకరించిన భద్రతా డేటాను విశ్లేషించిన తరువాత మాత్రమే వ్యాక్సిన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించినప్పటికీ టీకాల భద్రత సమర్ధతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే టెనస్సీలోని ఫైజర్-బయోఎన్‌టెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ షాట్ అందుకున్న హెడ్ నర్సు టిఫనీ డోవర్ ప్రెస్ ప్రశ్నలకు సమాధానాలిస్తూ అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వ్యాక్సిన్‌ భద్రత, సమర్థతపై (Coronavirus Infections) తీవ్రమైన సందేహాలను రేకెత్తించింది.

టేనస్సీలోని సీహెచ్‌ఐ మెమోరియల్ హాస్పిటల్ ఎన్ చత్తనూగలో విలేకరుల సమావేశంలో టిఫనీ డోవర్ మాట్లాడుతూ, టీకా తీసుకోవడం సంతోషిస్తున్నానని ప్రకటించారు. తర్వాత విలేకరుల సమావేశంలోనే మూర్ఛపోవడం కలకలం రేపింది. ఈ దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. క్షమించండి, మైకం కమ్ముతోందంటూ (US nurse faints after Pfizer-BioNTech) ఆమె మూర్ఛపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు వైరల్‌ గామారింది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Here's Viral Video 

భారత్‌లో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య (Coronavirus India) కోటి 30వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 26,624 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 1,00,31,223కు చేరింది. శనివారం 341 మంది మృతి చెందగా ఇప్పటి వరకు 1,45,477 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరో ఆరు నెలలు మాస్క్ వాడాల్సిందే, నైట్‌ కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌ పెట్టడం ఇష్టం లేదని తెలిపిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే

ఈ మేరకు ఆదివారం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక నిన్న 29,690 మంది డిశ్చార్జి అవ్వగా.. మొత్తం 95,80,402 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,05,344 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 95.51గా ఉంది. మరణాల రేటు 1.45కు తగ్గగా.. యాక్టివ్‌ కేసుల శాతం 3.04గా ఉంది.

మరోవైపు తెలంగాణలో కొత్తగా 592 కేసులు వెలుగుచూడగా మొత్తం పాజిటివ్‌ కేసుల 2,81,414కు చేరింది. ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు 1,513 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6,888 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి నిన్న 643 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున​ బాధితుల సంఖ్య 2,73,013కు చేరింది