UP Coronavirus: ఒకే కుటుంబంలో 32 మందికి కరోనా, యూపీలోని బండాలో ఓ ఫ్యామిలీ మొత్తానికి కరోనా వచ్చిందని తెలిపిన అధికారులు, ఉత్తరప్రదేశ్‌లో 2,30,414 కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
Coronavirus in India (Photo Credits: IANS)

Lucknow, Sep 1: దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విరుచుకుపడుతోంది. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. కుటుంబంలో ఒకరికి వస్తే ఏకంగా ఫ్యామిలీ మొత్తానికి వైరస్ అంటుకుంటోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబంలోని 32 మంది కరోనా వైరస్ బారిన పడటం (32 of family test COVID-19 positive in Banda) కలకలం రేపింది. బండాలో ఒకే ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబానికి చెందిన వీరికి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో (Coronavirus) పాజిటివ్ వచ్చిందని అధికారులు మంగళవారం తెలిపారు. వీరితో పాటు, 44 మందితో కలిసి సోమవారం సాయంత్రానికి జిల్లాలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 807కు చేరిందని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎన్ డీ శర్మ ప్రకటించారు.

మరోవైపు కరోనా వైరస్ కారణంగా యూపీలో జర్నలిస్ట్ నీలన్షు శుక్లా (28) మరణించారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే తనకు పాజిటివ్ వచ్చిందని, తనతో సన్నిహితంగా మెలిగిన వారు అప్రమత్తం కావాలని ఆగస్టు 20న ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఇంతలోనే ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. యూపీ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,30,414 కు చేరగా, 3,486 మంది మరణించారు. లక్షణాలు లేకుండానే కరోనా, నేటి నుంచి అన్‌లాక్‌4 అమలు

భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 69,921 పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదడంతో మొత్తం కేసుల సంఖ్య 36,91,167 కు (India's COVID-19 Tally) చేరింది. వైరస్‌ బాధితుల్లో తాజాగా 819 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 65,288 (Coronavirus Deaths) చేరింది. కరోనా రోగుల్లో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 28,39,883. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,85,996.ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.