Plasma Therapy in India for Coronavirus (Photo Credits: PTI)

New Delhi, September 1: భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 69,921 పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదడంతో మొత్తం కేసుల సంఖ్య 36,91,167 కు (India's COVID-19 Tally) చేరింది. వైరస్‌ బాధితుల్లో తాజాగా 819 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 65,288 (Coronavirus Deaths) చేరింది. కరోనా రోగుల్లో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 28,39,883. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,85,996.

ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా వైరస్‌ బాధితుల రికవరీ రేటు 76.94 శాతంగా ఉందని తెలిపింది. అలాగే మరణాల రేటు 1.77 శాతంగా ఉందని వెల్లడించింది. ఇదిలాఉండగా... 62 లక్షల కరోనా కేసులతో అమెరికా మొదటి స్థానంలో 39 లక్షల కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.

నేటి నుంచి అన్‌లాక్‌4 నిబంధ‌న‌లు అమ‌లులోకి రానున్నాయి. సెప్టెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు అన్‌లాక్‌4 నియ‌మావ‌ళిని పాటించాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ గ‌త శ‌నివారం అన్‌లాక్‌4 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. సెప్టెంబ‌ర్ 7వ తేదీ నుంచి మెట్రో స‌ర్వీసుల‌ను దేశ‌వ్యాప్తంగా ప్రారంభించ‌నున్నారు. స్కూళ్లు, కాలేజీలు మాత్రం బంద్ చేసి ఉంటాయి. మ‌త‌ప‌ర‌మైన, రాజ‌కీయ‌, సామాజిక‌, క్రీడా స‌మావేశాలకు వంద‌కు మించి జ‌నం హాజ‌రుకావ‌ద్దు అంటూ అమ‌నుతి ఇచ్చింది. సెప్టెంబర్‌ 30 వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం

అయితే సెప్టెంబ‌ర్ 21వ తేదీ నుంచి ఈ నిబంధ‌న వ‌ర్తిస్తుంది. అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు ఈనెల చివ‌ర వ‌ర‌కు నిలిపివేశారు. కేవ‌లం అనుమ‌తి ఉన్న విమానాల‌కే ప్ర‌యాణం ఉంటుంది. అంత‌ర్ జిల్లా, అంత‌ర్ రాష్ట్ర ప్ర‌యాణాల‌కు అనుమ‌తి అవ‌స‌రం లేదు. కంటోన్మెంట్ కాని ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమ‌లు చేయ‌కూడ‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఆదేశం జారీ చేసింది.  అన్‌లాక్‌–4 మార్గదర్శకాలను విడుదల చేసిన హోంశాఖ

ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా బారినపడిన వారిలో 31 శాతం మందిలో మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయని, 69 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా బారినపడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు నమోదైన కేసులను విశ్లేషించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,24,963 మంది కరోనా బారినపడగా వారిలో 86,225 మందిలో ఎటువంటి లక్షణాలు లేవని పేర్కొంది. లక్షణాలు లేని వారు తమకు తెలియకుండానే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకే కుటుంబంలో 15 నుంచి 20 మంది వరకు కరోనా బారినపడుతుండడానికి అదే కారణమని విశ్లేషించింది.

అసింప్టమాటిక్ రోగుల ద్వారా వైరస్ బారినపడిన ప్రాథమిక, సెకండరీ కాంటాక్టులను గుర్తించి పరీక్షలు చేసి వారికి తక్షణమే వైద్యం అందించడం వల్ల చాలా మంది రోగులు త్వరగానే కోలుకున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,299 యాక్టివ్ కేసులుంటే అందులో 24,216 మంది హోం ఐసోలేషన్, లేదంటే సంస్థాగత క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రస్తుతం సీరియస్ కేసులు గణనీయంగా తగ్గాయని, ఆసుపత్రులలో పడకలు ఖాళీ అవుతున్నాయని అధికారులు తెలిపారు.