Rasgulla (Photo Credits: ANI)

Rasgullas Fight Agra Wedding Function : పెళ్లిళ్లు అంటేనే ఎంతో హడావుడితో ఉంటాయి. బంధువుల సంద‌డి, చిన్నారుల అల్ల‌ర్ల‌తో పెళ్లి మండ‌పాలన్నీ సంతోషకరమైన వాతావరణంతో మునిగి తేలుతుంటాయి..ముందుగా మనకు పెళ్లి అంటే అందరికి గుర్తొచ్చేది పసందైన వంటకాలే. ఈ వేడుకల్లో రకరకాలైన వంటకాలు చేసి వచ్చిన అతిథులకు వడ్డిస్తారు. ఒక్కొక్కసారి అయితే జనం ఎక్కువయితే కొంత ఆహారం కొరత కూ డా ఏర్పడుతుంది. తాజాగా  ఓ విచిత్ర సంఘటన ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకుంది. అక్కడ రసగుల్లాల కోసం పెళ్లికి వచ్చిన అథిధులు కొట్టుకున్నారు. ఈ  సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో చోటు చేసుకుంది.

ఘటన వివరాల్లోకి వెళితే.. స్థానిక శంషాబాద్ ప్రాంతం లో ఆదివారం రోజు ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వివాహ వేడుకల్లో వచ్చిన అతిథులకు పసందైన వంటకాలు చేసి వడ్డించారు. అయితే కొద్దిసేపట్లోనే వడ్డించిన రసగుల్లాలు మొత్తం అయిపోయాయి. కొంతమందికి ఆ రసగుల్లాలు అందలేదు. ఈ క్రమంలో ఓ వ్యక్తి రసగుల్లాలు అందకపోవడంతో వడ్డించేంవారిపై చిందులు తొక్కాడు. ఇది కాస్తా కొంత ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీస్ అధికారి అనిల్ శర్మ తెలిపారు.

పట్టపగలే అందరూ చూస్తుండగా.. ఓ యువతి కిడ్నాప్, సోషల్ మీడియాలో వీడియో వైరల్.

క్షతగాత్రులను భగవాన్ దేవి, యోగేష్, మనోజ్, కైలాష్, ధర్మేంద్ర, పవన్ గా గుర్తించారు. వారిని వెంటనే చికిత్సానంతరం స్థానిక ఆసుపత్రికి తరలిచారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

కాగా గతేడాది అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ఎత్మాద్‌పూర్‌లో ఓ పెళ్లి వేడుకలో మిఠాయిల కొరత విషయమై జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు.