Molestation. (Photo Credits: Pixabay)

Lucknow, August 2: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ పట్టణంలో కామాంధుల చేతిలో ఓ విద్యార్థిని (16) నిండుప్రాణం బలైంది.ఈ దారుణం జులై 27న జరగగా నాలుగు రోజుల చికిత్స అనంతరం మంగళవారం ఆ బాలిక మృతి చెందింది.వేధింపులను వ్యతిరేకించినందుకు 16 ఏళ్ల బాలికను కొందరు యువకులు బలవంతంగా శానిటైజర్ తాగించారు. దీంతో బాలిక మృతి చెందింది.

ఈ ఘటనతో బాలిక కుటుంబసభ్యులు, బంధువులు నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, మృతి చెందిన బాలిక మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి నిరసన తెలిపారు. జూలై 27న 11వ తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అప్పుడు నిందితుల్లో ఒకరైన ఉదేశ్ రాథోడ్ ఆమెను ఆపి వేధించడానికి ప్రయత్నించాడు.

దారుణం, 14 ఏళ్ల నుంచి 1000 సార్లు యువతిపై అత్యాచారం, పార్టీకి పిలిచి అమ్మాయిని సెక్స్ బానిసగా మార్చుకున్న కామాంధుడు

ఉదేశ్‌తో పాటు మరో ముగ్గురు యువకులు ఈ దారుణంలో ఉన్నట్లు సమాచారం. వేధింపులకు వ్యతిరేకంగా విద్యార్థిని నిరసన తెలపడంతో శానిటైజర్‌ తాగించారు. బాధితురాలి సోదరుడు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించగా అతడిపై కూడా దాడికి పాల్పడ్డాడు. నిందితులు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

బలవంతంగా శానిటైజర్‌ తాగించడంతో ఆస్పత్రిలో బాలిక పరిస్థితి విషమించింది. ఆమెను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టంలో నిజానిజాలు బయటకు వస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ భాటి తెలిపారు.కేసులో నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆ ప్రాంతంలో నాలుగు పోలీసు బృందాలను మోహరించారు. పోస్టుమార్టం రిపోర్టులో నిజానిజాలు బయటకు వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.