Kanpur, May 25: కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో విరబూసిన ప్రేమ (Lockdown Love) లాక్‌డౌన్ లోనే పెళ్లి వరకు (Lockdown love culminates in marriage) వెళ్లింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ జంట లాక్‌డౌన్ సమయంలో ఒక్కటయింది. ఇందులో పెళ్లి కొడుకు డ్రైవర్ కాగా, పెళ్లి కూతురు ఓ యాచకురాలు. వివరాల్లోకెళితే..యూపీకి (Uttar Pradesh)చెందిన నీలమ్ డ్రైవర్.. లాక్‌డౌన్ సమయంలో అందరికీ తనకున్న దాంట్లో పట్టెడన్నం పెట్టి కడుపు నింపుతున్నాడు.అమ్మాయే అబ్బాయి ఐడీతో గ్యాంగ్ రేప్ ఛాట్ చేసింది, బాయిస్ లాకర్ రూమ్ కేసులో బయటపడ్డ ట్విస్ట్, 26 మంది విద్యార్థులు అరెస్ట్
అలా ఓ రోజు ఆహారం పంచిపెడుతుండగా కాన్పూర్‌లోని కకాడియో క్రాసింగ్ దగ్గర ఫుట్‌పాత్ మీద అడుక్కుంటున్న నీలమ్‌ను చూశాడు. అందరితోపాటు ఆమెకూ ఆహారం పంపిణీ చేశాడు. ఆమెతో మాట కలిపి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అలా మొదలైన స్నేహం ప్రేమ వరకూ వెళ్లింది.
దీంతో ఆమెను యాచక వృత్తి వదులుకోవాలని కోరాడు. అందుకు ఆమె నిండుమనసుతో అంగీకరించడంతో స్థానిక బుద్ధాశ్రమంలో(Lord Buddha Ashram) సామాజిక కార్యకర్తల మధ్య వివాహం చేసుకున్నాడు.ముందు వారి జంటను వరుడి తరుపు కుటుంబసభ్యులు ఇష్టపడలేదు.
Here's Married Tweet
Today i feel happy to share this beautiful news from Kanpur.
Anil, who work as a driver, meet Neelam while distributing food. Anil distributes food to needy people in this lockdown.
Both fell in love with each other & now they got married. #LockdownWalaLove❤️@ShefVaidya pic.twitter.com/Qv3837xpeO
— IMShubham (@shubham_jain999) May 25, 2020
ఇదిలా ఉంటే నీల్‌తో తనకున్న స్నేహం గురించి అనిల్ తన యజమాని లాల్టా ప్రసాద్‌కు సమాచారం ఇచ్చాడు నీవు అమ్మాయిని నిజంగా ఇష్టపడితే ఆమెను వివాహం చేసుకోవచ్చన్నాడు. ఈ పెళ్లిని అంగీకరించమని ప్రసాద్ అనిల్ కుటుంబాన్ని ఒప్పించాడు. రెండు కుటుంబాలు ఈ జంటను ఆశీర్వదించాయి . నగల కోసం భార్యని పాముతో రెండు సార్లు కరిపించాడు, కేరళలో ఓ భర్త ఘాతుకం, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ విషయం గురించి నీలమ్ మాట్లాడుతూ.. "నా తండ్రి కొన్నేళ్ల క్రితమే మరణించగా తల్లి కొంతకాలం క్రితం కాలం చేసింది. ఈ సమయంలో అండగా ఉండాల్సిన అన్నావదినలు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పొట్ట నింపుకునేందుకు రోడ్ల వెంబడి యాచించడం మొదలు పెట్టాను. లాక్‌డౌన్ వల్ల జీవితం మరింత అగమ్యగోచరంగా మారిన స్థితిలో అనిల్ కనిపించి, నా జీవితంలో వెలుగులు నింపాడు" అని చెప్పుకొచ్చింది