 
                                                                 Lucknow, June 24: యూపీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తన భార్యను కాటేసిన పామును పట్టుకొని ( Man carries cobra snake) ఓ భర్త ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. పామును ఇక్కడకు ఎందుకు తెచ్చావ్ అని వైద్యులు అడిగిన ప్రశ్నకు అతను చెప్పిన సమాధానం షాక్ కొట్టినట్లు అయింది. ఘటన వివరాల్లోకెళితే.. సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తన పొలానికి సమీపంలో ఉన్న ఆలయంలో రైతు నిద్రిస్తుండగా పాము కాటేసింది.
దీంతో రామేంద్రయాదవ్ పామును పట్టుకొని ప్లాస్టిక్ సీసాలో బంధించాడు. భార్యతోపాటు పామును కూడా స్థానిక ఆస్పత్రికు ( hospital after being bitten) తీసుకెళ్లాడు. పామును ఎందుకు తీసుకొచ్చావ్? అని వైద్యులు అతడిని ప్రశ్నించారు. ‘నా భార్యకు ఏ పాము కరిచిందని మీరు అడిగితే నేనేం చెప్పాలి. అందుకే పామును తీసుకొచ్చాను. ఇక ఏ పాము కరిచిందో మీరే చూసుకొని వైద్యం చేయొచ్చు’ అని వింత సమాధానమివ్వడంతో వైద్యులు కంగుతిన్నారు.
అతని భార్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక పామును సమీపంలోని అడవిలో విడిచిపెడతానని రామేంద్రయాదవ్ మీడియాతో తెలిపాడు. పాముకు ఊరిరాడేలా ప్లాస్టిక్ బాటిల్‌కు రంధ్రాలు చేశానని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కాగా పాము కాటుకు గురైన గ్రామస్తుల్లో కొందరిని కాటు వేసిన పాము ఆకారం, పరిమాణంపై వైద్యుల అడుగుతున్నారని పాము కాటు బాధితులు చెప్పడంతో ఈ పనిచేశానని చెప్పడం అతని ముందు చూపుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
