Representational Image (Photo Credits: Twitter)

Mathura, Aug 24:  మథురలోని కనోహ్ గ్రామంలో గత వారంలో ఒక అంతుచిక్కని జ్వరం ఐదుగురు పిల్లలతో సహా ఆరుగురు ప్రాణాలను ('Mysterious' Fever Claims 6 Lives) తీసింది. దాదాపు 80 మంది మధుర, ఆగ్రా మరియు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని వివిధ ఆసుపత్రులలోఈ అంతుచిక్కని జ్వరంతో చేరారు. ఆరోగ్య శాఖ అధికారుల ప్రకారం, ఇద్దరు పిల్లలు సేవక్ (9) మరియు హనీ (6) సోమవారం చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు.

తీవ్రమైన జ్వరంతో వారు ఆస్పత్రిలో చేరారు. రుచి, 19, అవనీష్, 9, రోమియా, 2, మరియు రేఖ, 1 మొదలగు చిన్నారులు ఈ జ్వరం లక్షణాలను నివేదించిన తర్వాత మరణించారు. ఆసుపత్రిలో చేరిన రోగులు మరియు వారి బంధువుల నుండి మలేరియా, డెంగ్యూ, మరియు కోవిడ్ -19 నిర్ధారణ కొరకు వైద్యుల బృందం గ్రామాన్ని సందర్శించి నమూనాలను తీసుకున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రచనా గుప్తా తెలిపారు. అయితే మరణానికి కారణం ఇంకా అస్పష్టంగా ఉందని, జ్వరంతో పాటు వారి రక్తపు ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నట్లు గుర్తించినందున డెంగ్యూ వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

దేశంలో కొత్తగా 25,467 కరోనా కేసులు, నిన్న 354 మంది మృతి, ప్రస్తుతం భారత్‌లో 3,19,551 యాక్టివ్ కేసులు

గ్రామంలో పురుగుమందు పిచికారీ చేయబడింది మరియు ఫాగింగ్ కూడా నిర్వహించబడింది. గ్రామస్థులకు జ్వరం అనిపిస్తే లేదా అలాంటి లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే ఆసుపత్రికి తెలియజేయండని అధికారులు తెలిపారు.