Kanpur, July 18: యూపీలో ఓ మహిళను కింద పడేసి ఓ ఎస్సై దారుణంగా కొట్టినట్లుగా (Pic of UP Policeman And Woman's Scuffle Goes Viral) సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. మహిళ అని కూడా చూడకుండా ఆమె పట్ల ఎస్సై ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ డెహత్ జిల్లా దుర్గాదాస్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అయితే దీనిపై కాన్పూర్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
ఈ ఘటనలో వాస్తవాలు తెలుసుకోవాలని ట్వీట్ ద్వారా తెలిపారు. ఆ మహిళ ఎస్సై కాలర్ పట్టుకోవడంతో దానిని విడిపించుకునేందుకే ఆ ఎస్సై అలా చేశాడని తెలిపారు. యూపీ పంచాయితీ ఎన్నికల్లో శివరాం యాదవ్ అనే వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడ్డారని. అందులో భాగంగానే అతని భార్య పోలీసులపై దాడికి దిగిందని.. వారిని నిలువరించేందుకు పోలీస్ టీం అక్కడకు వెళ్లిందని అయితే వారిపై కూడా ఆ మహిళతో పాటు కుటుంబ సభ్యులు అటాక్ చేశారని తెలిపారు.
కాన్పూర్ డిహాత్ ఎస్‌పీ కేశవ్ చౌదరి దీనిపై మాట్లాడుతూ ఆ వీడియోలో (Kanpur Police Shares Video) ఉన్నది భోగిన్‌పూర్ ఎస్సై మహేంద్ర పటేల్ అని ఆ మహిళ ఆ ఎస్సై కాలర్ పట్టుకుని దాడికి దిగిందని తెలిపారు. యాదవ్ భార్య అతని తల్లి పోలీసుపై దాడికి దిగడంతో అతను ఆత్మరక్షణ కోసం వారిపైకి దాడికి దిగాడని ఈ నేపథ్యంలోనే అతన్ని ఆ మహిళ కిందపడేసి కాలర్ పట్టుకుందని తెలిపారు. ఆ కాలర్ విడిపించుకునే సమయంలోనే ఈ వీడియో బయటకు వచ్చిందని అన్నారు.
Here Is The Video Shared By Kanpur Dehat Police:
https://t.co/R6xsHpUV4r pic.twitter.com/oktTiMghWl
— Kanpur Dehat Police (@kanpurdehatpol) July 17, 2021
थाना भोगनीपुर-चौकी इंचार्ज पुखरायां से सम्बन्धित वायरल फोटो के सम्वन्ध में पुलिस अधीक्षक कानपुर देहात द्वारा दी गई बाइट। @Uppolice pic.twitter.com/QGV2HiEoNN
— Kanpur Dehat Police (@kanpurdehatpol) July 17, 2021
https://t.co/nXVN7ojqEg pic.twitter.com/OGV5BJG2zn
— Kanpur Dehat Police (@kanpurdehatpol) July 17, 2021
అయితే సోషల్ మీడియాలో వస్తున్న కథనం ప్రకారం..ఇటీవల ఓ వ్యక్తిని భోగిన్‌పూర్ ఎస్సై మహేంద్ర పటేల్ (Sub-inspector Mahendra Patel) అరెస్టు చేశాడు. అయితే, ఆయనను విడిచిపెట్టాలంటే లంచం ఇవ్వాలని అడుగుతున్నారని అతని భార్య ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆమెను ఎస్సై కొట్టాడు. ఆమెను కిందపడేసి, ఆమె మీద కూర్చుని బాదాడు. చివరకు స్థానికులు పోలీసును అడ్డుకోవడంతో విడిచిపెట్టాడు. స్నేహితులతో కలిసి శివం యాదవ్ అనే వ్యక్తి జూదం ఆడుతున్న కారణంగానే తాము అరెస్టు చేశామని ఎస్సై అంటున్నాడు.
అరెస్టు చేయకుండా అతని భార్య ఆర్తి, తల్లి తమను అడ్డుకోవాలని ప్రయత్నించి, తమపై దాడి చేశారని చెప్పాడు. నిందితుడు పారిపోయేందుకే పోలీసులను మహిళ అడ్డగించారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎస్సై పటేల్‌ను భోగిన్‌పూర్ విధుల నుంచి తప్పించామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.