Rape | Representational Image (Photo Credits: Pixabay)

Lucknow, April 25: యూపీలో మ‌హిళ‌లు, బాలిక‌లు, చిన్నారుల‌పై లైంగిక దాడి ఘ‌ట‌న‌లు ఆగడం లేదు. బాఘ్ప‌ట్ జిల్లాలో 11 ఏండ్ల బాలిక‌పై లైంగిక దాడికి ( raping 11-year-old minor girl) పాల్పడిన చ‌ర్చి పాస్ట‌ర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి కుటుంబ‌స‌భ్యులు చాందినిన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబం లలియానా గ్రామంలో చ‌ర్చి ప‌క్క‌న నివ‌సిస్తుండ‌గా పాస్ట‌ర్ వారి కూతురిపై దారుణానికి (Uttar Pradesh Shocker) పాల్ప‌డ్డాడు.

బాధితురాలిని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఏప్రిల్ 23న చ‌ర్చి పాస్ట‌ర్‌పై పిర్యాదు అందింద‌ని సీఐ విజ‌య్ చౌధ‌రి తెలిపారు. ద‌ళిత వ‌ర్గానికి చెందిన బాధిత బాలిక రెండ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది.డ‌బ్బు ఆశ చూపి చ‌ర్చి పాస్ట‌ర్ బాలిక‌ను రూం లోప‌లికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని బాధితురాలి త‌ల్లి పేర్కొంది. ఆపై బాలిక‌కు అశ్లీల వీడియోలు చూపుతూ దారుణానికి ఒడిగట్టాడ‌ని బాలిక త‌ల్లి ఆరోపించారు. బాలిక జ‌రిగిన విష‌యం కుటుంబ స‌భ్యుల‌కు తెల‌ప‌డంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. నిందితుడిని తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన 67 ఏళ్ల చర్చి పూజారి ఆల్బర్ట్‌గా (Church priest Albert) గుర్తించారు.