Hamirpur, August 22: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఏకంగా న్యాయమూర్తలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా న్యాయవాది తనను వేధిస్తున్నాడంటూ ఒక మహిళా జడ్జీ ఆరోపించింది. అతడు తన వెంట పడుతున్నాడని, తన మొబైల్ ఫోన్‌కు మెసేజ్‌లు పంపుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హమీర్‌పూర్ కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా న్యాయమూర్తి ఒంటరిగా నివసిస్తున్నది.
అయితే మహ్మద్ హరూన్ అనే లాయర్ ఆమెను వేధిస్తున్నాడు. సాయంత్రం వాక్ చేస్తున్నప్పుడు ఆమె వెంటపడి అనుసరించేవాడు. ఆమె వేసుకున్న రంగుల దుస్తులు, బూట్లు వేసుకునేవాడు. ఆ మహిళా న్యాయమూర్తి మొబైల్ ఫోన్‌కు మెజేస్‌లు కూడా న్యాయవాది మహ్మద్ హరూన్ పంపుతున్నాడు. అంతేగాక గోడలోని కన్నం నుంచి ఆమె ఆఫీస్‌లోకి పదే పదే తొంగి చూసేవాడు. ఆమె పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతడు లెక్కలేయక వీటిని (harassing & stalking her in Hamirpur) కొనసాగిస్తున్నాడు.
దీంతో విసిగిపోయిన ఆ మహిళా జడ్జీ చివరకు లాయర్ మహ్మద్ హరూన్‌పై పోలీసులకు ఫిర్యాదు (Woman judge files case against lawyer) చేసింది. అతడు పంపిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్‌లను అందజేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ అనూప్ కుమార్ తెలిపారు.