Representational Image | (Photo Credits: Unsplash)

Rishikesh, Dec 26: ఉత్తరాఖండ్ రిషికేశ్‌లో దారుణ ఘటన (Uttarakhand Shocker)చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి అడవిలో మద్యం సేవిస్తున్న 32 ఏళ్ల వ్యక్తిని అకస్మాతుగా ఓ పెద్ద పులి వచ్చి (Tiger drags away man ) ఈడ్చుకెళ్లింది. అనంతరం అతడ్ని సగం తిని వదిలేసింది. రామ్‌నగర్ అడవిలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.మృతుడ్ని ఖతారి గ్రామానికి చెందిన నఫీస్‌గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయం కాలం నఫీస్ స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు ఊరిబయట ఉన్న Corbett reserve లోకి వెళ్లాడు. కాలువ బ్రిడ్జ్ పక్కన కూర్చొని మందుతాగుతున్నారు. ఇంతలో ఓ పులి అక్కడకు వచ్చింది. అక్కడున్న నఫీస్‌ను నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. ఇది చూసి స్నేహితులు భయంతో అక్కడి నుంచి పరారయ్యారు.

ప్రిన్సిపాల్ కాదు కీచకుడు, ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్ లో దారుణం, బాలికను లైంగికంగా వేధిస్తూ అడ్డంగా దొరికిపోయాడు..

పోలీసులకు సమాచారం అందడంతో వాళ్లు నఫీస్‌ కోసం గాలించారు. బ్రిడ్జికి 150 మీటర్ల దూరంలో ఆదివారం ఉదయం అతని మృతదేహం సగ భాగం లభ్యమైంది. పులి అతడ్ని సగం తిని వదిలేసింది. అయితే ఇది కార్బెట్ టైగర్ రిజర్వ్ ప్రాంతమని, తరచూ పులులు ఇక్కడ సంచరిస్తాయని పోలీసులు తెలిపారు. గ్రామస్థులు ఈ ప్రదేశానికి వెళ్లవద్దని సూచించారు.