New Delhi, July 17: కోవిడ్-19 కారణంగా దాదాపు నాలుగు నెలలుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు (India resumes some international travel) నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాల నుంచి మన దేశానికి నేటి నుంచి పాక్షికంగా విమానాలు (International Flights) నడవనున్నాయి. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ నెల 17-31 మధ్య 18 విమానాలను నడపనుంది. ఢిల్లీ-న్యూయార్క్ (Delhi- New york) మధ్య ప్రతి రోజూ, ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడు రోజులు విమానాలు నడపనున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep singh puri) తెలిపారు. సెప్టెంబర్ 1 నాటికి 35 లక్షలకు కరోనా కేసులు, అంచనా వేసిన ఐఐఎస్సీ, దేశంలో 10 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు..25 వేల మరణాలు, ఒక్క రోజులో 34,956 మందికి కొత్తగా కోవిడ్ 19 పాజిటివ్
ఇక ఈ నెల 18 నుంచి ఆగస్టు 1 మధ్య ఎయిర్‌ఫ్రాన్స్ కు చెందిన 28 విమానాలు నడవనున్నాయి. అలాగే, ఈ రెండు దేశాలకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మరోపక్క, ఢిల్లీ, లండన్ మధ్య రోజుకు రెండు విమానాలు నడిపేందుకు బ్రిటన్‌తో ఒప్పందం చేసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ఒప్పందం కుదిరిన తరువాత.. ఢిల్లీ, లండన్‌ల మధ్య రోజుకు రెండు సర్వీసులు ఉంటాయని పురి తెలిపారు. జర్మనీకి చెందిన ఎయిర్ లుఫ్తాన్సాతో దాదాపు ఒప్పందం పూర్తయిందని మంత్రి పూరి వివరించారు. ఈ వివరాలను విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం వెల్లడించారు.
కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో దీపావళి నాటికి దేశీయ ట్రాఫిక్ కరోనా ముందున్న స్థాయితో పోలిస్తే.. 55 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో కొందరు విమాన ప్రయాణికులు భౌతిక దూరం నిబంధనను సరిగ్గా పాటించకపోవడాన్ని మిగతావారు ప్రధాన సమస్యగా భావిస్తున్నారని ఒక సర్వేలో తేలింది. జూన్ 20 నుంచి జూన్ 28 వరకు ఆన్‌లైన్‌లో సుమారు 25 వేల మంది ప్రయాణికులను సర్వే చేశామని ఇండిగో ప్రకటించింది.