Delhi Metro Viral Video

New Delhi, FEB 15: మెట్రో రైల్‌ స్టేషన్‌లోని ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్ల పైనుంచి కొందరు ప్రయాణికులు దూకారు. అక్కడ హంగామా చేయడంతోపాటు సెల్ఫీలు తీసుకున్నారు. (Passengers Jumping Over AFC Gates) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ కార్పొరేషన్ వివరణ ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో (New Delhi) ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 13న సాయంత్రం మెజెంటా లైన్‌లోని జామా మసీదు మెట్రో స్టేషన్ వద్ద ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో కొందరు వ్యక్తులు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్ల పైనుంచి దూకి బయటకు వెళ్లారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ముస్లిం యువకుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. అక్కడి సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది వారిని పట్టించుకోలేదని కొందరు ఆరోపించారు.

Video Of Passengers Jumping Over AFC Gates At Jama Masjid Metro Station

 

కాగా, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) శనివారం వివరణ ఇచ్చింది. ఫిబ్రవరి 13న జామా మసీదు మెట్రో స్టేషన్ వద్ద ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరుగడంతో ఈ సంఘటన జరిగినట్లు పేర్కొంది. కొందరు వ్యక్తుల క్షణికమైన ప్రతిచర్య అని వెల్లడించింది. అయితే భద్రతా సిబ్బంది, ఇతర సిబ్బంది తగినంత ఉన్నారని, పరిస్థితి అదుపు తప్పలేదని వివరించింది.