PM Modi US Visit: ఈ అంశాల మీదనే ప్రధాని మోదీ అమెరికా పర్యటన, 5 రోజుల టూర్ నిమిత్తం అమెరికాకు బయల్దేరిన భారత ప్రధాని, పర్యటనలో పలు దేశాధినేతలను కలవనున్న నమో
PM Modi US Visit(Photo-Twitter)

New Delhi, Sep 22: భారత ప్రధాని నరేంద్ర మోదీ.. 5 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు బయల్దేరారు. కొద్ది క్షణాల క్రితమే మోదీ న్యూఢిల్లీ నుంచి అగ్రరాజ్యానికి (Pm Modi US Visit) పయనమయ్యారు. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో ఇవాళ అమెరికా టూర్ (Visit to US an Occasion to Strengthen Global Strategic) గురించి పోస్టు చేశారు. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఆహ్వానం మేర‌కు తాను ఆ దేశానికి వెళ్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రెండు దేశాల మ‌ధ్య స‌మ‌గ్ర‌మైన వాణిజ్య వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం (Strengthen Strategic Partnership) గురించి స‌మీక్షించ‌నున్న‌ట్లు మోదీ తెలిపారు.

అమెరికా ప‌ర్య‌ట‌న ద్వారా వ్యూహాత్మ‌క బంధాన్ని బ‌లోపేతం చేయ‌నున్న‌ట్లు త‌న ట్వీట్‌లో చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా మోదీ.. ఆ దేశ ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌‌ను గురువారం వాషింగ్టన్‌లో కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాల‌జీ రంగంలో రెండు దేశాల మ‌ధ్య స‌హ‌కారంపై ఆమెతో చ‌ర్చించ‌నున్నారు.

దేశంలో నిన్న కొత్తగా 26,964 క‌రోనా కేసులు, మ‌రో 383 మంది మృతి, కేరళలో తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు

అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ ఈ నెల 24న వాషింగ్టన్‌లో సమావేశం కానున్నారు. అమెరికాతో భారత ద్వైపాక్షిక సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పెట్టుబడులు, రక్షణ రంగాలు, అఫ్ఘానిస్థాన్‌లోని పరిస్థితులు, ఉగ్రవాద నిరోధం, ఇండో-పసిఫిక్‌, వాతావరణ మార్పులు వంటి అంశాలపై బైడెన్‌తో మోదీ చర్చలు జరపనున్నట్లు సమాచారం.

Here's PM Tweet

క్వాడ్ నేత‌ల స‌ద‌స్సులోనూ పాల్గొన‌నున్న‌ట్లు మోదీ తెలిపారు. ఇక ఆసీస్ ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్‌, జ‌పాన్ ప్ర‌ధాని మోషిహిడే సుగాల‌తో మోదీ భేటీ అవుతారు. ద్వైపాక్షిక సంబంధాల‌ను బ‌లోపేతం చేసేందుకు స్కాట్ మారిస‌న్‌, సుగాల‌తో వ్య‌క్తిగ‌తంగా స‌మావేశం కానున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అలాగే ఈ నెల 24నే వాషింగ్టన్‌లో చతుర్భుజ భద్రతా కూటమి(ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌, అమెరికా కూటమి) సదస్సులోనూ మోదీ పాల్గొననున్నారు.ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స‌మావేశాల్లోనూ ప్ర‌సంగించ‌నున్న‌ట్లు తెలిపారు. కోవిడ్‌19, ఉగ్ర‌వాదం, వాతావ‌ర‌ణ మార్పులు లాంటి కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు చెప్పారు. ఆదివారం రోజు భారత్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.