కర్ణాటకలో ఓ 20 ఏండ్ల యువ‌కుడు 50 ఫీట్ల ఎత్తున్న డ్యామ్‌ను ఎక్క‌బోయి జారిప‌డ్డాడు. బాధితుడు గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. క‌ర్ణాట‌క చిక్క‌బ‌ళ్ల‌పూర్ జిల్లాలోని శ్రీనివాస సాగ‌ర డ్యామ్ నుంచి నీళ్లు కిందకు జలపాతం మాదిరి వస్తున్నాయి. అయితే అక్క‌డికి చేరుకున్న ఓ 20 ఏండ్ల యువ‌కుడు.. 50 ఫీట్ల ఎత్తున్న డ్యామ్‌ను కింద నుంచి ఎక్కేందుకు య‌త్నించాడు. 25 ఫీట్ల ఎత్తు వ‌ర‌కు బాగానే ఎక్కాడు. ఆ త‌ర్వాత ప‌ట్టు త‌ప్ప‌డంతో జారి ప‌డ్డాడు. దీంతో అత‌నికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. అక్క‌డున్న వారు బాధితుడిని చికిత్స నిమిత్తం బెంగ‌ళూరు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. యువ‌కుడిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)