Wayanad landslide: Death toll rises to 63, a total of 116 injuries reported so far: Kerala Revenue Minister's office

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 308 దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 308 మంది చనిపోయినట్టు అధికారులు నిర్దారించారు. డ్రోన్ ఆధారిత రాడార్ సాయంతో నాలుగో రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ విలయంలో 200 మందికిపైగా గాయపడ్డారు. 300 మంది ఆచూకి ఇంకా కానరాలేదు. పడవెట్టికున్ను వద్ద ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు గాయాలతో వారి ఇంట్లో సజీవంగా కనిపించారు. పడవెట్టికున్ను చూరమల నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. వైద్యసేవల నిమిత్తం కుటుంబాన్ని విమానంలో ఆస్పత్రికి తరలించేందుకు సైన్యం ఏర్పాట్లు చేస్తోంది. వయనాడ్‌లో ఆగని మృత్యుఘోష, వరదలో కొట్టుకువస్తున్న మృతదేహాలు, 281కి పెరిగిన మరణించిన వారి సంఖ్య, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

భారీ వర్షాలు, ఘటన జరిగిన ప్రాంతానికి సజావుగా వెళ్లే పరిస్థితులు లేకపోవడం, భారీ పరికరాల కొరత వంటివి సహాయక చర్యలను ఆటంక పరుస్తున్నాయి.పేరుకుపోయిన బురద, నేల కూలిన వృక్షాలు, భవనాలను తొలగించడం కష్టంగా మారింది.

Here's ANI Video

ఇండియన్ ఆర్మీ, ఎన్‌డీఆర్ఎఫ్, కోస్ట్‌గార్డ్, ఇండియన్ నేవీ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. ఒక్కో బృందంలో ముగ్గురు స్థానికులు, అటవీశాఖ అధికారి కూడా ఉన్నారు. మొత్తం 40 బృందాలు ఆరు జోన్లుగా విడిపోయి సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి.