Heavy Rains (Photo-ANI)

జనవరి 6-10 మధ్య తమిళనాడు, కేరళ, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు (Heavy rainfall, hailstorm ) కురుస్తాయని IMD అంచనా వేసింది. జనవరి 8-9 తేదీల్లో J&K, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్‌లలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. జనవరి 8-9 తేదీలలో రాజస్థాన్‌లో మరియు జనవరి 9న పశ్చిమ మధ్యప్రదేశ్‌లో వివిక్త వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

IMD అంచనా ప్రకారం.. రాగల మూడు, నాలుగు రోజులపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో (warnings issued for several states)భారీ వర్షాలు, వడగండ్ల వాన పడే అవకాశం ఉన్నదని తెలిపింది. తమిళనాడు, కేరళ, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్‌ తీరాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతోపాటు, అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉన్నదని ఐఎండీ (IMD) తెలిపింది.

తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు, తూత్తుకుడి జిల్లాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, వీడియో ఇదిగో..

జమ్ముకశ్మీర్‌, చండీగఢ్‌, ఢిల్లీతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ నెల 8, 9 తేదీల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఇక రాజస్థాన్‌లో జనవరి 8, 9 తేదీల్లో.. పశ్చిమ మధ్యప్రదేశ్‌లో జనవరి 9వ తేదీన వడగండ్ల వానలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది.