Representational Picture

New Delhi, Sep 8: దేశంలో రానున్న మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీతో 19 రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పశ్చిమ మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు పడే సూచనలున్నాయంటూ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, తూర్పు రాజస్థాన్‌లో భారీ వర్షాలు పడుతాయని, దేశంలోని తూరు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.ముంబయిలో గురువారం భారీ వర్షాలకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.

వాతావరణంలో ఎన్నడూ లేనంతగా పెను మార్పులు, తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్న భారీ వర్షాలు

జీ20 సమావేశాలు జరుగుతున్న ఢిల్లీలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సదస్సు వేదికైన భారత్‌ మండపం చుట్టూ సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ఈ మేరకు ప్రత్యేకంగా బులిటెన్‌ విడుదల చేసింది. శుక్రవారం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని.. సెప్టెంబర్‌ 8-10 తేదీల మధ్య ఉష్ణోగ్రతలు 35-39 డిగ్రీల, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 26-28 మధ్య ఉండే అవకాశాలున్నాయని చెప్పింది.