Bengal man assaulting couple in 'illicit relationship' in full public view

Kolkata, July 1: పశ్చిమ బెంగాల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లా చోప్రా పట్టణంలో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ ఓ జంటను కొంతమంది విచక్షణారహితంగా కొట్టారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు నడిరోడ్డుపై వారికి బహిరంగ శిక్ష (Bengal man assaulting couple) విధించాడు. ఇద్దర్నీ రోడ్డుపై పడేసి.. మహిళను జుట్టు పట్టుకొని కొట్టి, కిందపడేసి తన్నాడు.

జనం ఈ దాడిని గుమికూడి చూస్తున్నారే కాని, దాడిని ఆపే ప్రయత్నం చేయకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చోప్రా పట్టణంలో అధికారపార్టీకి చెందిన స్థానిక నాయకుడే దాడికి తెగబడ్డాడని, స్థానికంగా తలెత్తే వివాదాల్లో తీర్పులు చెబుతూ.. నడిరోడ్డుపై శిక్షలు అమలుజేస్తున్నాడని బీజేపీ, సీపీఎం ఆరోపించాయి.  ఇదేమి త్యాగం బాబోయ్, రెండో సంతానం కోసం భర్తకు దగ్గరుండి మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు, పెళ్లి పత్రికను చూశారా..

నిందితుడు చోప్రా ఎమ్మెల్యే రెహమాన్‌ ముఖ్య అనుచరుడు తేజ్‌ముల్‌గా బీజేపీ ఐటీ విభాగం ‘ఎక్స్‌’లో పేర్కొన్నది. మమత సర్కార్‌ పాలనలో ‘బుల్డోజర్‌ జస్టిస్‌’ అమలైందని సీపీఎం నాయకుడు ఎండీ సలీం అన్నారు. బెంగాల్‌లో సామాన్యులపై దాడులు కొనసాగుతున్నాయని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడి ఘటనపై ఇస్లామ్‌పూర్‌ ఎస్పీ జాబీ థామస్‌ స్పందించారు. ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేయనున్నట్టు చెప్పారు. కాగా, దాడి ఘటనను తృణమూల్‌ ఖండించింది. నిందితుడు ఏ పార్టీకి చెందినా వదిలిపెట్టేది లేదని స్పష్టంచేసింది.

TMC MLA Hamidul Rahman Statement

స్థానిక నేతల భయంతో బాధితులు ఆస్పత్రికి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నిందితుడి పేరు తజ్ముల్ అని తెలిసింది.స్థానికంగా అతడిని జేసీబీ అంటారు. అతను చోప్రా తృణమూల్ ఎమ్మెల్యే హమీదుల్ రెహమాన్‌కు సన్నిహితుడు. ఈ ఘటనలో జేసీబీని ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు.

JP Nadda Tweet

ఈ గ్రామంలో తరచూ ఈ మధ్యవర్తిత్వ సమావేశాలు జరుగుతుంటాయని తెలుస్తోంది. దీనిని 'ఇన్సాఫ్ సభ' అంటారు. ఈ సమావేశంలో గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంటారు. స్థానిక సమాచారం ప్రకారం బాధితురాలు ఆ గ్రామానికి చెందిన యువతి. బాధితురాలికి అప్పటికే వివాహమైంది. తర్వాత ఆ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ సంఘటన ఆధారంగా, మధ్యవర్తిత్వ సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. అక్కడ వారిపై దాడి చేశారు.

చోప్రా ఘటనపై దుమారం చెలరేగగానే తృణమూల్ నేత హమీదుల్ రెహమాన్ నోరు విప్పారు. ఓ వీడియోలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, బహిరంగంగా కొట్టబడిన మహిళ 'సంఘ వ్యతిరేక' చర్యకు పాల్పడిందని పేర్కొన్నారు. అందుకే సమాజంలో మధ్యవర్తిత్వం వహించి తీర్పు చెప్పాలన్నారు. ఈ ఘటనపై జేపీ నడ్డా స్పందించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని పశ్చిమ బెంగాల్ మహిళలకు 'సురక్షితమైనది' కాదు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తృణమూల్‌ అధినేతను ఆమె భాషలోనే విమర్శించారు.