
Jalpaiguri, December 6: పశ్చిమబెంగాల్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన ప్రియురాలితో గొడవపడి ఏకంగా ప్రాణాలు తీసుకున్నాడు. వీడియో కాల్ చేస్తూ..అందులో మాట్లాడుతూనే..కోపంతో బ్రిడ్జిపై నుంచి నదిలోకి (Man Jumps Into River) దూకేశాడు. అనంతరం జల ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. పశ్చిమబెంగాల్ (West Bengal Shocker) రాష్ట్రంలోని జల్పాయ్‌గురి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీళ్లు మనుషులేనా.. ప్రేమ పెళ్లి చేసుకుందని అక్క తలను నరికేసిన తమ్ముడు. తెగిపడిన తలను చేత్తో పట్టుకుని తల్లితో కలిసి సెల్ఫీ, మహరాష్ట్రలో దారుణ ఘటన
జల్పాయ్‌గురి జిల్లా కేంద్రానికి చెందిన ధీరజ్ ప్రజాపతి స్థానికంగా ఓ యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో వీడియో కాల్ మట్లాడుతూ తీస్తానదిపై ఉన్న బ్రిడ్జి మీదకు వెళ్లాడు. మాటల్లోనే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దాంతో క్షణికావేశానికి లోనైన ధీరజ్ ప్రజాపతి.. ఫోన్ మాట్లాడుతూనే (Video Call With His Girlfriend) నదిలోకి దూకేశాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన ధీరజ్ కోసం సెర్చింగ్ చేపట్టారు.