రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయన చట్టాలపై (New Farm Laws) పంజాబ్ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ కొన్ని రోజుల నుండి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పందించాడు.
ఇంకా ఎన్నాళ్లు వారిని ఇలాంటి పరిస్థితుల్లో చూడాలని ఆవేదన వ్యక్తం (Sonu Sood responds about farmers protest) చేశాడు. 'వి ది ఉమెన్'అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సోనూసూద్ మాట్లాడుతూ "ఈ విషయంలో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అని వాదించాలనుకోవడం లేదు. అయితే ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాను.
రైతులతో నాకు మంచి అనుబంధం ఉంది. పంజాబ్‌లో పుట్టిపెరిగాను. రైతులు చేస్తున్న ఈ పోరాటం కొంత మంది రైతులు ప్రాణాలు కూడా కోల్పోయారు. పొలాల్లో నాట్లు వేస్తూ ఉండాల్సిన రైతులు .. వారి కుటుంబంతో కలిసి రోడ్లపై చలికి (Sonu Sood on Farmers Protest) వణుకుతున్నారు. ఇంకా ఎన్నిరోజులు రైతులు ఈ పరిస్థితుల్లో ఉంటారో తెలియడం లేదు. అయితే ఈ దృశ్యాల్ని ఎప్పటికీ మరచిపోలేం" అన్నారు.
ఈ పోరులో కొందరు రైతులు మరణించడం బాధాకరమన్నాడు. ప్రేమగా చెబితే రైతులు వింటారని సోను చెప్పుకొచ్చాడు. పొలాల్లో విత్తనాలు నాటుతూ ఉండాల్సిన రైతులు పిల్లాపాపలతో రోడ్లపైన చలిలో వణుకుతున్నారని, వీరిని ఇలా ఇంకెన్ని రోజులు చూడాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశాడు.