Delhi Shocker: ఢిల్లీలో దారుణం, మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, రాంచీలో విహారయాత్ర అంటూ వదినపై మరిది దారుణ అత్యాచారం
Image used for representational purpose only | (Photo Credits: ANI)

Delhi, April 15: దేశ రాజ‌ధాని ఢిల్లీలో మహిళపై గ్యాంగ్ రేప్ జ‌రిగింది. 36 ఏళ్ల మ‌హిళ‌పై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారం (Woman gangraped in west Delhi) చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఆ ముగ్గుర్ని పోలీసులు అరెస్టు ( 3 held) చేశారు. నిందితుల‌ను న‌వీన్ సింగ్ భండారి, బిశ్వ మోహ‌న్ ఆచార్య‌, అక్ష‌య్ త‌నేజాలుగా గుర్తించారు. అత్యాచారం (Woman gangraped) జ‌రిగిన నాలుగు గంట‌ల్లోనే నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. మాదిపూర్ పోలీస్ స్టేష‌న్‌లో రేప్‌కు సంబంధించిన ఫిర్యాదు న‌మోదు అయిన‌ట్లు డిసీపీ ఘ‌న్‌శ్యామ్ భ‌న్సాల్ తెలిపారు. 376డీ, 328 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో విచార‌ణ జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

బీహార్‌లో జరిగిన మరో దారుణ ఘటన వ‌దిన‌పై క‌న్నేసిన మ‌రిది ఆమెను వివిధ న‌గ‌రాల‌కు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న వెలుగు చూసింది. త‌న‌ను ప‌ట్నా, ఢిల్లీ, కోల్‌క‌తా న‌గ‌రాల‌కు విహార యాత్ర పేరుతో తీసుకువెళ్లిన మ‌రిది ఆపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని రాంచీ మ‌హిళ ఆరోపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంచీలోని పిధోరియాకు చెందిన నిందితుడు బాధితురాలి ఇంటికి త‌ర‌చూ వెళుతుండేవాడు. ఈ క్ర‌మంలో మార్చి 28న ఆమెను బ‌య‌ట క‌లుసుకోవాల‌ని పిలిపించాడు. ఆపై బ‌స్టాడ్‌కు తీసుకువెళ్లి పాట్నాకు బ‌య‌లుదేరాడు.

కామాంధులకు ఇదేమి పోయకాలం, మానిటర్ బల్లిపై నలుగురు దారుణంగా అత్యాచారం, ఈ రేప్ ఘటనను వీడియోలో చిత్రీకరించిన కామాంధులు, వీడియో చూసి షాక్ తిన్న మహారాష్ట్ర పోలీసులు

అక్క‌డ నుంచి రైలులో బాధితురాలిని విహార యాత్ర‌కు అని చెప్పి రైలులో ఢిల్లీకి తీసుకువెళ్లాడు. అక్క‌డ రూం అద్దెకు తీసుకుని రెండు రోజుల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఆపై కోల్‌క‌తాకు వెళ్లి అక్క‌డ మ‌రోసారి ఆమెపై లైంగిక దాడికి తెగ‌బ‌డ్డాడు. ఏప్రిల్ 4న ఇద్ద‌రూ రాంచీకి చేరుకున్నారు. ఈ విష‌యం ఎవ‌రికైనా చెబితే కుటుంబ స‌భ్యులంద‌రినీ చంపేస్తాన‌ని రైల్వేస్టేష‌న్‌లో మ‌హిళ‌ను హెచ్చ‌రించి ప‌రార‌య్యాడు. ఇంటికి చేరుకున్న బాధితురాలు జ‌రిగిన విష‌యం భ‌ర్త‌కు తెలిపింది. భ‌ర్త‌తో క‌లిసి అర్గోర పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మ‌రం చేశారు.