Pune, May 25: మహారాష్ట్రలో పుణే నగరంలో దారుణం చోటు చేసుకుంది. అత్తతో గొడవపడిన కోడలు ఆమెను తన ఇంట్లోనే పాశవికంగా హత్య (woman kills mother-in-law) చేసింది. అంతే కాకుండా తన భర్త సాయంతో ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నం (tries to dispose of body with husband's help) చేసింది. ఈ ప్రయత్నంలో పక్కింటి వ్యక్తి కంటపడటం..అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దొరికిపోయింది. ఈ దారుణమైన ఈ ఘటన పుణె సమీపంలోని తాలెగావ్ దభడేలో ఆలస్యంగా వెలుగుచూసింది.
తాలెగావ్ దభడే పోలీసులు, స్థానికుల తెలిపిన కథనం ప్రకారం.. బేబీ గౌతమ్ షిండే(50)కుమారుడు మిలింద్ గౌతమ్ షిండేతో పూజ మిలింద్ షిండే(22)కు పెళ్లి జరిగింది. అయితే ఏమైందో ఏమో.. మే 21 న ఇంట్లో ఒంటరిగా అత్త ఉన్న సమయంలో ఆమెను చంపేశారు. అనంతరం భార్యభర్తలిద్దరూ ఓ భారీ గోనె సంచిని ఆదివారం ఇంట్లోంచి బయటకు తీసుకెళ్లడం వారి పొరుగు వ్యక్తి గమనించాడు. వారిద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాలనీలోని సీసీ టీవీల్లో రికార్డయిన దృశ్యాలను సేకరించారు.
నిందితులిద్దరూ ఓ గోనె సంచిని తమ ఇంట్లోంచి బయటకు తీసుకెళ్లడం అందులో రికార్డయింది. ఆ తర్వాత సమీపంలోని ఖాళీ స్థలంలో ఉన్న చెట్ల పొదల్లో మృతదేహాన్ని పోలీసులు గర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి విచారించగా హత్య చేసిన తీరును పోలీసులకు వివరించారు.
కోడలు పూజకు, తన అత్తకు మధ్య శుక్రవారం గొడవ జరిగింది. అనంతరం తన అత్త గొంతుకు జాకెట్‌ను గట్టిగా బిగించి పూజ ఆమెను హత్య (Pune woman kills mother-in-law) చేసింది. ఆ తర్వాత దంపతులిద్దరూ కలిసి మృతదేహాన్ని ఓ గోనె సంచిలో కుక్కి ఇంటి మిద్దె పైన ఉంచారు. మృతదేహం నుంచి దర్వాసన వస్తుండటంతో భర్త సాయంతో దానిని అక్కడి నుంచి తరలించి సమీంలోని ఖాళీ స్థలంలో ఉన్న చెట్ల పొదల్లో పడేసినట్లు నిందితురాలు పోలీసులకు వివరించింది. ఈ సంఘటనపై మరింత దర్యాప్తు జరుగుతోందని తలేగావ్ దభడే పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ భాస్కర్ జాదవ్ చెప్పారు.