World Bank on Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ బ్యాంకు గుడ్ న్యూస్, ఈ ఏడాది వృద్ధి రేటు 7.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేసిన వరల్డ్ బ్యాంక్
World Bank (Photo-PTI)

2024లో భారత ఆర్థిక వ్యవస్థ 7.5 శాతానికి పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా(forecasts) వేసింది.కాగా గతంలో ఈ అంచనాను 6.3 వద్ద వరల్డ్ బ్యాంక్ ఉంచగా.. ఇప్పుడు ఏకంగా 7.5కి పెంచింది.భారతదేశ(bharat) వృద్ధి రేటులో ప్రధానంగా సేవా రంగం, పారిశ్రామిక అభివృద్ధి నుంచి వస్తుందని చెప్పింది.ఇక దక్షిణాసియా(South Asia)లో వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుందని తెలిపింది. ఆసియా అపరకుబేరుడుగా ముకేశ్ అంబానీ, రెండవ స్థానంలో గౌతం అదానీ, భారత్ బిలియనీర్లు లిస్టు ఇదిగో..

ఇక భారత్ వేగవంతమైన వృద్ధి రేటు కారణంగా పాకిస్థాన్, శ్రీలంక ఆర్థిక వ్యవస్థల్లో మెరుగుదల ఉంటుందని, ఇది దక్షిణాసియా(South Asia) దేశాల మొత్తం వృద్ధి రేటుపై ప్రభావం చూపుతుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం రానున్న రెండేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి దక్షిణాసియా ప్రాంతంలోనే ఉంటుందని తెలిపింది.2025 సంవత్సరంలో కూడా దక్షిణాసియా దేశాల మొత్తం వృద్ధి రేటు 6.1 శాతంగా అంచనా వేసింది.