Mukesh Ambani and Gautam Adani (photo-Wikimedia Commons)

ఫోర్బ్స్ తన తాజా వరల్డ్స్ బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2,781 మంది వ్యక్తులు బిలియనీర్ యొక్క ఉన్నత స్థాయికి చేరుకున్నారు. వారి సంపదను సమిష్టిగా లెక్కిస్తే 14.2 ట్రిలియన్ల డాలర్లుగా ఉంటుంది. ఇది గత సంవత్సరం కంటే 2 ట్రిలియన్ల డాలర్ల పెరుగుదలను సూచిస్తుంది.

ఫ్రాన్సుకు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 233 బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.  195 బిలియన్ డాలర్లతో ఎలోన్ మస్క్ రెండవ స్థానంలో  అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 194 బిలియన్ల డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. మార్క్ జుకర్‌బర్గ్ నికర విలువ 177 బిలియన్ల డాలర్లతో నాలుగో స్థానంలో. లారీ ఎల్లిసన్ 141 బిలియన్ల డాలర్లతో 5వ స్థానంలో ఉన్నారు.

ఇక భారత్ బిలియనీర్ల విషయానికి వస్తే.. భారత్‌తో పాటు ఆసియాలోనే కుబేరుడిగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. 2024-ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ఆయన వ్యక్తిగత సంపద 83 బిలియన్ డాలర్ల నుంచి 116 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో భారత్ నుంచి ఆయన ఒక్కరే 100 బిలియన్ల డాలర్ల క్లబ్‌లో చోటు దక్కించుకున్నారు. ఎలాన్ మస్క్ ఎక్స్ నుంచి టిప్ జార్ పేరుతో కొత్త ఫీచర్, ఇకపై ఈ ఫీచర్ ద్వారా పేమెంట్లు కూడా చెల్లించుకోవచ్చు

ముకేశ్ అంబానీ తర్వాతీ స్థానంలో నిలిచిన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ వ్యక్తిగత సంపద 84 బిలియన్ డాలర్లు. ఏడాదిలో 36.8 బిలియన్ డాలర్ల సంపద పెంచుకుని గ్లోబల్ బిలియనీర్లలో 17వ ర్యాంకులో కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఏడాది కాలంలో భారత్ కుబేరుల సంఖ్య 169 నుంచి 200 మందికి చేరుకున్నది. గతేడాదితో పోలిస్తే బిలియనీర్ల వ్యక్తిగత సంపద 675 బిలియన్ డాలర్ల నుంచి 41 శాతం పుంజుకుని 954 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లింది.ఇక కొత్త భారత్ కుబేరుల జాబితాలోకి నరేశ్ త్రిహాన్, రమేశ్ కన్హికనన్, రేణుకా జాగ్తియానీ ప్రవేశించగా, బైజూ రవీంద్రన్, రోహికా మిస్త్రీ పేర్లు కుబేరుల నుంచి మాయం అయ్యాయి.

భారత్ బిలియనీర్లు లిస్టు ఇదే..

ముకేశ్ అంబానీ – 116 బిలియన్ డాలర్లు

గౌతం అదానీ – 84 బిలియన్ డాలర్లు

శివ నాడార్ – 36.9 బిలియన్ డాలర్లు

సావిత్రి జిందాల్ – 33.5 బిలియన్ డాలర్లు

దిలిప్ షాంఘ్వి – 26.7 బిలియన్ డాలర్లు

సైరస్ పూనావాలా – 21.3 బిలియన్ డాలర్లు

కుషాల్ పాల్ సింగ్ – 20.9 బిలియన్ డాలర్లు

కుమార్ బిర్లా – 19.7 బిలియన్ డాలర్లు

రాధాకిషన్ దమానీ – 17.6 బిలియన్ డాలర్లు

లక్ష్మీ మిట్టల్ – 16.4 బిలియన్ డాలర్లు